అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nagaland Spurious Liquor | కల్తీ మద్యం తాగి 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన నాగాలాండ్లో (Nagaland) చోటు చేసుకుంది.
రాష్ట్రంలో 1990 నుంచి మద్యపాన నిషేధం అమలులో ఉంది. అయినా కూడా కొందరు గుట్టుచప్పుడు కాకుండా మద్యం అమ్మకాలు చేపడుతున్నారు. కొందరు కల్తీ మద్యం సైతం విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా కల్తీ లిక్కర్ తాగి 19 మంది చనిపోయారు. అక్రమ మద్యం సేవించిన తర్వాత రెండు రోజుల్లో మోకోక్‌చుంగ్ జిల్లాలో ఎనిమిది మంది, టుయెన్‌సాంగ్ జిల్లాలో 11 మంది మరణించారని పోలీసులు తెలిపారు.
Nagaland Spurious Liquor | సిట్ ఏర్పాటు
ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సిరీయస్‌గా తీసుకుంది. కల్తీ మద్యం మూలాలు, సరఫరా, మరణాలపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ సిట్‌కు ఏఎస్పీ బుంగ్లాంగ్ చాంగ్ నేతృత్వం వహించనున్నారు. మరణాలకు గల కారణాలను నిర్ధారించడానికి నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపినట్లు ఆయన తెలిపారు. 19 మంది మృతి అనంతరం పోలీసులు పలు ప్రాంతాల్లో దాడులు చేశారు. 3,000 మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని, 19 మంది నిందితులను అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి..: India Pakistan UN | పాక్ వ్యాఖ్యలకు భారత్ కౌంటర్