Supreme Court | సుప్రీంకోర్టు పొదుపు చర్యలు.. వారానికి రెండు రోజులు వర్చువల్ హియరింగ్​

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Supreme Court | సుప్రీంకోర్టు పొదుపు చర్యలు ప్రారంభించింది. సోమ, శుక్రవారం పూర్తిగా వర్చువల్ హియరింగ్ చేపడుతామని ప్రకటించింది.

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్రోల్ (Petrol)​, డీజిల్ (Diesel) ఆదా చేయాలని, వర్క్​ ఫ్రం హోమ్ (Work from home) ప్రోత్సహించాలని ఇటీవల ప్రధాని మోదీ (PM Modi) సూచించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సుప్రీంకోర్టు సైతం చర్యలు చేపట్టింది. సోమ, శుక్రవారాలు విచారణలు ఇకపై కేవలం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాత్రమే నిర్వహిస్తారు. వేసవి సెలవులు, ఇతర విరామ కాలాలలో కోర్టు పనిచేసే పాక్షిక పనిదినాలలో జాబితా చేయబడిన కేసులను కూడా వర్చువల్‌గా మాత్రమే విచారిస్తారు.

Supreme Court | కారు పూలింగ్​

ఇంధన వినియోగాన్ని మెరుగుపరిచేందుకు అధికారిక ప్రయాణాలకు కార్-పూలింగ్‌ను ప్రోత్సహించడానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా అంగీకరించారు. కారు పూలింగ్ అంటే ఒకే మార్గంలో లేదా ఒకే గమ్య స్థానానికి వెళ్లే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒకే కారులో కలిసి ప్రయాణించడం. ఇది పెట్రోల్ ఖర్చులను ఆదా చేయడంతో పాటు, ట్రాఫిక్, కాలుష్యాన్ని తగ్గించడానికి, సమయాన్ని ఆదా చేయడానికి దోహదపడుతుంది.

Supreme Court | వారికి వర్క్​ ఫ్రం హోమ్​

ప్రతి విభాగంలోని రిజిస్ట్రీ సిబ్బందిలో 50 శాతం వరకు వారానికి రెండు రోజులు ఇంటి నుంచే పనిచేయడానికి కోర్టు అనుమతించింది. అయితే, కోర్టు రిజిస్ట్రీ కార్యకలాపాలు నిరంతరాయంగా కొనసాగేలా చూసేందుకు మిగిలిన సిబ్బంది కార్యాలయానికి భౌతికంగా హాజరుకావాల్సి ఉంటుంది. అవసరమైతే ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగులను తక్షణమే కార్యాలయానికి పిలవవచ్చని కూడా సర్క్యులర్‌లో పేర్కొన్నారు.

దీనిని కూడా చదవండి : Bhojshala Verdict |నమాజ్ హక్కులు రద్దు.. భోజ్‌శాల హిందువులకే : మధ్యప్రదేశ్‌ హైకోర్టు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *