Bandra Garib Nagar Demolition | బాంద్రాలోని గరీబ్ నగర్​లో భారీగా కూల్చివేతలు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandra Garib Nagar Demolition | ముంబై (Mumbai)లోని బాంద్రా ఈస్ట్​లో అధికారులు భారీగా కూల్చివేతలు చేపట్టారు. పశ్చిమ రైల్వే, ఇతర అధికారులు మంగళవారం కూల్చివేతలు ప్రారంభించారు.

బాంద్రా ఈస్ట్​లో చాలా మంది అక్రమంగా నివసిస్తున్నారు. దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. చట్టబద్ధంగా నివసిస్తున్న 100 మంది నివాసితులు మినహా, మిగిలిన వారందరూ ఈ చర్యను ఎదుర్కొంటారు. కూల్చివేతల అనంతరం ఆ స్థలాన్ని ముంబై నుండి వచ్చే 50 కొత్త రైళ్లకు సౌకర్యం కల్పించడానికి, బాంద్రా టెర్మినల్​ విస్తరణకు ఉపయోగించనున్నారు. బాంద్రా సబర్బన్ స్టేషన్‌ (Bandra Suburban Station)ను బాంద్రా టెర్మినస్‌కు అనుసంధానించడానికి, సబర్బన్ రైళ్లను వేరు చేయడానికి అదనపు స్థలాన్ని ఉపయోగించుకుంటారు.

Bandra Garib Nagar Demolition | నాలుగు రోజుల పాటు

బాంద్రాలోని గరీబ్ నగర్​లో భారీ ఎత్తున కూల్చివేత కార్యక్రమం ప్రారంభమైంది. ఆ ప్రాంతంలోని అనధికారిక నిర్మాణాలను తొలగించడానికి బాంబే హైకోర్టు (Bombay High Court) పశ్చిమ రైల్వేకి అనుమతి ఇచ్చింది. ఈ కూల్చివేతల ప్రక్రియ మే 23 వరకు కొనసాగనుంది. కూల్చివేత సందర్భంగా ఆ ప్రాంతంలో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించి, భద్రతను కట్టుదిట్టం చేశారు. బీజేపీ నాయకుడు కిరీట్ సోమయ్య బాంద్రా టెర్మినస్ వద్ద ఉన్న ‘బంగ్లాదేశీ’ ఆక్రమణలను తొలగించినందుకు రైల్వే శాఖకు, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Petrol Diesel Price Hike | సామాన్యుడిపై మరో వడ్డన: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *