అక్షరటుడే, వెబ్‌డెస్క్: Train Charging Rules | రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య రైళ్లలోని మొబైల్ ఛార్జింగ్ పాయింట్లను నిలిపి వేయాలని ఆదేశించింది.
ఇటీవల ముంబై (Mumbai) లోకల్ రైలులో ఛార్జింగ్ చేస్తుండగా ఒక ప్రయాణికుడి పవర్ బ్యాంక్ పేలిపోయింది. దీంతో కోచ్ మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది. దీంతో రైల్వే బోర్డు రాత్రివేళ ఛార్జింగ్ పాయింట్లు బంద్ చేయాలని నిర్ణయించింది. గతంలోనే ఆ నియమం ఉన్నా.. రైల్వే సిబ్బంది ఛార్జింగ్ పాయింట్లను ఆపివేయడంలో విఫలమయ్యారని ఆ లేఖలో పేర్కొంది. దీంతో ప్రమాదం జరిగిందని పేర్కొంది. ఇక నుంచి ఆ నియమాన్ని పక్కాగా అమలు చేయాలని ఆదేశించింది.
Train Charging Rules | తనిఖీలు చేయాలి
రైళ్లలో అందరు నిద్రలో ఉండగా.. ఛార్జింగ్ పెట్టిన ఫోన్లు పేలితే తీవ్రత ప్రమాద తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలో రైల్వే బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5గంటల వరకు అన్ని కోచ్‌లలోని ఛార్జింగ్ పాయింట్లు ఆపివేయబడేలా సిబ్బందికి సూచించాలని, జోనల్ రైల్వేలను కోరింది. అధికారులు, సూపర్‌వైజర్‌లు కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించింది. భద్రతా చర్యను అమలు చేయడంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని బోర్డు హెచ్చరించింది.
ఇది కూడా చదవండి..: Meerut Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసులో ట్విస్ట్.. హైకోర్టుకు దోషుల అప్పీల్