అక్షరటుడే, గాంధారి: Gandhari Woman Death | ఇంటి పక్కన రెండు కుటుంబాలు గొడవ పడుతుంటే ఆపేందుకు వెళ్లిన ఓ వృద్ధురాలు అనుకోని స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన గాంధారి మండలం (Gandhari Mandal)లో చోటుచేసుకుంది.
Gandhari Woman Death | గేదెను కట్టేసే విషయంలో గొడవ..
వివరాల్లోకి వెళితే గాంధారి మండలంలోని నేరల్తండా గ్రామానికి చెందిన మధురా భాయ్ ఇంటి పక్కన వరుసకు కోడళ్లయిన ఇద్దరు మహిళలు గొడవ పడుతున్నారు. గోదెను తమ స్థలంలో కట్టేసిందనే విషయంలో ఇరువురు మహిళలు కొట్లాడుతుండగా.. మధ్యలో మధురా బాయి వెళ్లి సముదాయించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో వారు కర్రతో ఆమె తలపై దాడిచేసినట్లుగా సమాచారం. దీంతో గాయపడ్డ మధురబాయి(60)ను తండావాసులు వెంటనే గాంధారి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లుగా వైద్యులు పేర్కొన్నారు. దీంతో తండావాసులు గాంధారి మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. మధురబాయి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అక్కడికి చేరుకున్న సీఐ చౌదరి, ఎస్సై మహేందర్ బాధిత కుటుంబాలకు నచ్చజెప్పినప్పటికి వారు వినిపించుకోలేదు. ప్రస్తుతం ధర్నా కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి..: Kharge Effigy Burned | కామారెడ్డిలో ఖర్గే దిష్టిబొమ్మ దహనం