అక్షరటుడే, నిజామాబాద్‌సిటీ: Star Health Nizamabad | ‘స్టార్ హెల్త్’ నిజామాబాద్‌లో (Nizamabad)విస్తృతమైన సేవలందిస్తున్నామని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్‌గఢ్ స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ బిజినెస్ హెడ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలోని సంస్థ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
Star Health Nizamabad | ఉచితంగా వైద్యసేవలు
శ్రీనివాస్ మాట్లాడుతూ.. డాక్టర్ కన్సల్టేషన్లు, ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు, ఔషధాలు, హెల్త్ కౌన్సెలిం టీకాలపరమైన మద్దతును సంస్థ కార్యాలయంలో ఉచితంగా అందజేస్తున్నామన్నారు. జిల్లా కేంద్రంలో సంస్థ ఆరోగ్య సేవా కేంద్రం ప్రారంభించినప్పటికీ నుంచి 3,800 మందికి పైగా ప్రజలు సందర్శించారన్నారు. సగటున రోజుకు 15 పైచిలుకు విజిట్స్ నమోదవుతున్నాయన్నారు. స్థానికులు సకాలంలో కన్సల్టేషన్లు, ప్రాథమిక పరీక్షలు, ఔషధాలు తదుపరి మద్దతును పొందేలా ఇక్కడి వైద్యులు సిబ్బంది కృషి చేస్తున్నారన్నారు.
Star Health Nizamabad | ఎక్కువగా మధుమేహం.. హైపర్‌టెన్షన్
నిజామాబాద్ ఆరోగ్య సేవా కేంద్రంలోని డాక్టర్లు ఇచ్చిన వివరాల ప్రకారం ఈ కేంద్రాన్ని తరచుగా సందర్శించే వారిలో 40 నుంచి 80 ఏళ్ల వారు ఎక్కువగా ఉంటున్నారని శ్రీనివాస్ పేర్కొన్నారు. అత్యధికంగా హైపర్‌టెన్షన్, జ్వరం, మధుమేహంలాంటి ఆరోగ్య సమస్యలకు వైద్య సహాయం తీసుకుంటున్నారన్నారు. ఇప్పటివరకు ఈ సెంటర్లో 1,900మందికి పైగా మధుమేహం పరీక్షలు, 2,700 మందికి పైగా రోగులకు హైపర్‌టెన్షన్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. స్టార్ హెల్త్ ప్రస్తుతం తమ సీఎస్ఆర్ పోర్ట్‌ఫోలియో కింద నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్‌లో మొత్తం నాలుగు ఆరోగ్య సేవా కేంద్రాలను నిర్వహిస్తోందన్నారు.
స్థానికంగా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలను మరింతగా అందుబాటులోకి తేవాల్సిన అవసరాన్ని నిజామాబాద్‌లోని ఆరోగ్య సేవా కేంద్రానికి లభిస్తున్న స్పందన తెలియజేస్తోందన్నారు. క్లినిక్‌లో ఒక డాక్టర్, నర్సు, సహాయక సిబ్బంది ఉంటారు. హెమోగ్లోబిన్ టెస్టింగ్, ర్యాండమ్ బ్లడ్ షుగర్ టెస్టింగ్, షుగర్, అల్బుమిన్కి సంబంధించి మూత్ర పరీక్షలు, మలేరియాకి సంబంధించి ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్టింగ్ మొదలైన సర్వీసులను ఇది అందిస్తుంది. ఈ కార్యక్రమంలో, తెలంగాణ రీజినల్ హెడ్ సురేష్, ఆరోగ్య సేవా కేంద్రం క్లినిక్ డాక్టర్ సాయి చరణ్, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పీఆర్వో తేజస్వి బండారి పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: GGH Workers Issues | జీజీహెచ్‌లో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి