Ravneet Singh Bittu | కేంద్ర మాజీ మంత్రి కాన్వాయ్​పై దాడి

పంజాబ్​లో కేంద్ర మాజీ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూ కాన్వాయైపై దాడి జరిగింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ravneet Singh Bittu | కేంద్ర మాజీ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూ కాన్వాయైపై దాడి జరిగింది. ‘నషా ముక్త్ పంజాబ్ యాత్ర’లో పాల్గొనేందుకు పఠాన్‌ కోట్‌ వెళ్తుండగా కాన్వాయ్​పై కొందరు దాడి చేశారు.

పఠాన్‌కోట్ నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ (Nitin Nabin) పార్టీ ‘నషా ముక్త్ పంజాబ్ యాత్ర’ను ప్రారంభించనున్నారు. ఈ యాత్ర మొత్తం 117 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 4,000 కిలోమీటర్ల మేర సాగి, సెప్టెంబర్ 30న జలంధర్‌లో ముగుస్తుంది. పంజాబ్ యువత వ్యసనాల బారిన పడేలా చేశారని ఆరోపిస్తూ, మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా పార్టీ ఉద్యమాన్ని ప్రారంభిస్తోందని నబిన్ తెలిపారు. ఈ యాత్రలో పాల్గొనడానికి వెళ్తున్న బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి రవ్‌నీత్ సింగ్​ బిట్టు కాన్వాయ్​పై దాడి జరిగింది.

Ravneet Singh Bittu | పంజాబ్​ సీఎం బాధ్యత వహించాలి

బిట్టు కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం.. దాడి అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)తో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ముగ్గురు వ్యక్తులను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. రవ్‌నీత్ సింగ్ బిట్టుకు ఏమైనా జరిగితే, ఆయన భద్రతకు పంజాబ్ ముఖ్యమంత్రి, డీజీపీలే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని కార్యాలయం పేర్కొంది. ఇటువంటి సంఘటనలు ప్రజాస్వామ్యానికి, రాజకీయ నాయకుల భద్రతకు తీవ్ర ముప్పు కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని బిట్టు డిమాండ్ చేశారు. తనను యాత్రలో పాల్గొనకుండా అడ్డుకునేందుకే స్థానిక ఎమ్మెల్యే షెర్రీ ఆ వ్యక్తులను పంపారని ఆరోపించారు.

ఇది కూడా చదవండి..: GST Officer Bribery | రూ.8 లక్షల లంచం తీసుకుంటూ చిక్కిన జీఎస్టీ అధికారి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *