Bishnoi Gang Encounter | బిష్ణోయ్​ గ్యాంగ్​పై పోలీసుల కాల్పులు

లారెన్స్ బిష్ణోయ్, రషీద్ కేబుల్ వాలా గ్యాంగ్‌లకు చెందిన ఇద్దరు పోలీసుల ఎన్​కౌంటర్​లో గాయపడ్డారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bishnoi Gang Encounter | ఢిల్లీలోని యమునా ఖాదర్ ప్రాంతంలో లారెన్స్ బిష్ణోయ్, రషీద్ కేబుల్ వాలా గ్యాంగ్‌లకు చెందిన ఇద్దరు అనుమానిత అనుచరులు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డారు. అనంతరం నిందితులను అరెస్ట్​ చేనసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.

ఈశాన్య ఢిల్లీ (Delhi)లో పోలీసులు, దుండగులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఉస్మాన్‌పూర్ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల ఎదురుకాల్పుల్లో ఇద్దరు దుండగులు గాయపడ్డారు. వీరిని మహమ్మద్ కైఫ్, మహమ్మద్ జాసీమ్‌గా గుర్తించారు. వీరికి లారెన్స్ బిష్ణోయ్, రషీద్ కేబుల్‌వాలా ముఠాలతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరు డబ్బు వసూలు చేసేందుకు అక్టోబర్ 2న భజన్‌పురా ప్రాంతంలోని ఒక వ్యాపారవేత్త ఇంటి బయట కాల్పులు జరిపారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు వారి కోసం గాలించారు.

Bishnoi Gang Encounter | పక్కా సమాచారంతో..

దుండగులు ఉస్మాన్‌పూర్‌లోని తమ ఇంటికి రావాలని యోచిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వారు అటవీ మార్గంలో వస్తారని పక్కా సమాచారం ఉండటంతో పోలీసులు వల పన్నారు. ఆ మార్గంలో భారీగా పోలీసులు మోహరించారు. ఈ ఆపరేషన్ మొత్తాన్ని అత్యంత రహస్యంగా నిర్వహించారు. నిందితులు రాగానే వారిని పోలీసులు చుట్టుముట్టారు. దీంతో వారు కాల్పులు జరిపారు. అనంతరం పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో ఇద్దరి కాళ్లకు గాయాలు అయ్యాయి.

ఇది కూడా చదవండి : Navy Sailor Arrest | కోయంబత్తూరులో నేవీ సైలర్ అరెస్టు.. పాక్ హనీట్రాప్‌లో చిక్కుకున్నాడా?

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *