Balapur Fire Accident | బాలాపూర్​లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌లోని బాలాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Balapur Fire Accident | హైదరాబాద్‌ (Hyderabad)లోని బాలాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్లాస్టిక్ గోదాములో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి.

నబీల్ కాలనీలోని గోదాములో మంటలు చెలరేగగా, లోపల నిల్వ ఉంచిన పాత రసాయనాల డ్రమ్ములు పేలిపోయాయి. గోదాము నుంచి దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

Balapur Fire Accident | రసాయన డ్రమ్ములతో..

గోదాములో మంటలు అంటుకున్న తర్వాత రసాయన డ్రమ్ములు పేలడంతో తీవ్రత ఎక్కువ అయింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందన్న వివరాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో భారీగా ఆస్తినష్టం జరిగింది. కాగా నగరంలో ఇటీవల తరచూ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. భవనాలు, ఫర్నిచర్​ దుకాణాలు, పరిశ్రమలు, గోదాముల్లో ఎక్కువగా మంటలు వ్యాపిస్తున్నాయి. అయినా సంబంధిత అధికారులు ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.

ఇదికూడాచదవండి: Hyderabad Water Supply | హైదరాబాద్​వాసులకు అలర్ట్​.. తాగునీటి సరఫరాలో అంతరాయం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *