అక్షరటుడే, వెబ్‌డెస్క్: AR Constable Suicide | హైదరాబాద్ (Hyderabad)లో విషాదం చోటు చేసుకుంది. ఓ ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ విఫలం కావడమే దీనికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
నగరంలోని అంబర్‌పేటలోని తిరుమలనగర్‌లో నివాసం ఉంటున్న నిభాష్ (25) పెట్లబుర్జులో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడు ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆమె కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి నిరాకరించారు. దీంతో మనస్థాపానికి గురైన నిభాస్ తిరుమలనగర్‌లోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేనసుకున్నాడు.
AR Constable Suicide | మిత్రులకు చెప్పి..
తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నిభాష్ వాట్సాప్ ద్వారా స్నేహితులకు సమాచారం అందించాడు. దీంతో వారు పోలీసులకు ఫోన్ చేశారు. అంతేగాకుండా అతడి నివాసానికి వచ్చి చూశారు. అప్పటికే ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి..: MIM Leader Murder | ఓల్డ్ సిటీలో ఎంఐఎం నేత హత్య..