MaxiVision Hospital | ఆపరేషన్​ చేయకుండానే ఇన్సూరెన్స్​ క్లెయిమ్​.. మ్యాక్స్​ విజన్​ ఆస్పత్రిపై కేసు

ఆపరేషన్​ చేయకుండానే మ్యాక్స్​ విజన్​ ఆస్పత్రి ఇన్సూరెన్స్​ క్లెయిమ్​ చేసింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MaxiVision Hospital | ఆపరేషన్​ చేయకుండానే ఓ ఆస్పత్రి ఇన్సూరెన్స్​ క్లెయిమ్​ చేసింది. రోగికి తెలియకుండానే డబ్బులు కాజేసింది. ఈ ఘటన హైదరాబాద్ (Hyderbad)​ నగరంలో చోటు చేసుకుంది.

బి.కె.గూడకు చెందిన కుమార్ గుంపుల్ల కంటి పరీక్ష కోసం జూన్ 26న సోమాజిగూడలోని మ్యాక్స్​విజన్​ ఆసుపత్రికి వెళ్లాడు. ఆ సమయంలో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. కుడి కంటిలో శుక్లం ఉన్నట్లు గుర్తించి, శస్త్రచికిత్స అవసరమని చెప్పారు. ఆయనకు ఆదిత్య బిర్లా హెల్త్​ ఇన్సూరెన్స్​ ఉంది. దీంతో ఆ వివరాలు తీసుకొని ఇన్సూరెన్స్​ వస్తుందో లేదో ఆస్పత్రి సిబ్బంది చెక్​ చేశారు. అయితే ఆయన ఆపరేషన్​ తర్వాత చేయించుకుంటానని చెప్పారు.

MaxiVision Hospital | రూ.40 వేలు క్లెయిమ్​

తాను ఆసుపత్రిలో చేరలేదని, అక్కడ కంటి శుక్లం శస్త్రచికిత్స లేదా మరే ఇతర చికిత్స/ప్రక్రియ చేయించుకోలేదని కుమార్​ తెలిపారు. అయితే ఆస్పత్రి సిబ్బంది తనకు ఆపరేషన్​ చేసినట్లు ఇన్సూరెన్స్​ క్లెయిమ్ చేసుకున్నారని ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్ 28న వేరే చోట శస్త్రచికిత్స చేయించుకోవడం గురించి ‘ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్’ను సంప్రదించినప్పుడు, మాక్స్ విజన్ హాస్పిటల్‌కు సంబంధించిన క్లెయిమ్ అప్పటికే పూర్తయి రూ.40 వేలు చెల్లించినట్లు తెలుసుకున్నారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు మ్యాక్స్​ విజన్​ ఆస్పత్రిపై కేసు నమోదు చేశారు. బీమా మొత్తాన్ని పొందేందుకు ఆస్పత్రి వారు తన పేరుతో తప్పుడు వైద్య, డిశ్చార్జ్ బిల్లింగ్ రికార్డులను సృష్టించి సమర్పించి ఉండవచ్చని ఆయన ఆరోపించారు.

దీనిని కూడా చదవండి : Pakistan Cosmetics Seized | అక్రమంగా పాక్​ కాస్మొటిక్స్​ అమ్మకం.. పోలీసుల దాడులు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.