Amazon Now Delivery | అమెజాన్ సంచలనం.. కేవలం రెండు వారాల్లోనే 120కి పైగా నగరాలకు ‘అమెజాన్ నౌ’ విస్తరణ

ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన అల్ట్రా-ఫాస్ట్ డెలివరీ సేవ అయిన 'అమెజాన్ నౌ'ను దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది.

Shivam nagarani

అక్షరటుడే  వెబ్‌డెస్క్:  Amazon Now Delivery | ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన అల్ట్రా-ఫాస్ట్ డెలివరీ సేవ అయిన ‘అమెజాన్ నౌ’ను దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఈ సేవ పరిధి రెట్టింపైందని, ప్రస్తుతం 120కి పైగా నగరాల్లో ఇది అందుబాటులోకి వచ్చినట్లు సంస్థ తాజాగా ప్రకటించింది.

Amazon Now Delivery | నిమిషాల్లోనే డెలివరీలు..

అమృత్‌సర్ ( Amritsar ), అబోహర్, జలంధర్, అంబాలా, మంగళూరు, మణిపాల్, వైజాగ్, కొచ్చి, భువనేశ్వర్ వంటి పలు నగరాల్లోని వినియోగదారులు ఇప్పుడు ‘అమెజాన్ నౌ’ ద్వారా నిమిషాల వ్యవధిలోనే డెలివరీలు అందుకుంటున్నారు. కిరాణా సరుకులు, పండ్లు, కూరగాయలు, ఫ్రోజెన్ ఫుడ్, పర్సనల్ కేర్, ఫ్యాషన్, బ్యూటీ ప్రొడక్ట్స్ నుంచి చిన్న గృహోపకరణాల వరకు పదుల వేల ఉత్పత్తులు క్షణాల్లో కస్టమర్ల చేతికి అందుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 800 మైక్రో-ఫుల్‌ఫిల్‌మెంట్, అర్బన్ ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాల ద్వారా ఈ ఆర్డర్లు విజయవంతంగా పూర్తవుతున్నాయి.

ఈ సందర్భంగా అమెజాన్ ఇండియా ఉపాధ్యక్షుడు (ఎవ్రీడే ఎసెన్షియల్స్) హర్ష్ గోయల్ మాట్లాడుతూ.. అమెజాన్ ఇండియా చరిత్రలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న బిజినెస్ విభాగంగా ‘అమెజాన్ నౌ’ నిలిచిందని తెలిపారు. ప్రతి త్రైమాసికంలో ఆర్డర్లు రెట్టింపు అవుతున్నాయని, పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని సేవలను మరింత విస్తరిస్తున్నట్లు చెప్పారు.

Amazon Now Delivery | భారీగా పెరిగిన అమ్మకాలు..

గత మూడు నెలల పనితీరు ఆధారంగా ‘అమెజాన్ నౌ’ వార్షిక స్థూల అమ్మకాలు 1 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు సెప్టెంబర్‌లో అమెజాన్ వెల్లడించింది. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా 300కి పైగా నగరాలకు ఈ సేవలను విస్తరించి, దేశంలోనే అతిపెద్ద ‘డెలివరీ-ఇన్-మినిట్స్’ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

Amazon Now Delivery | గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ధమాకా..

అక్టోబర్ 8 నుంచి ప్రారంభం కానున్న ‘అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సందర్భంగా వినియోగదారులు అమెజాన్ నౌ ద్వారా అనేక ఉత్పత్తులపై ఆకర్షణీయమైన డీల్స్ పొందవచ్చు. ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులు , ఈఎంఐ లావాదేవీలపై 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుండగా, ప్రైమ్ మెంబర్స్‌కు అదనపు ఆదా లభిస్తుంది.

ఇది కూడా చదవండి:  Paddy Procurement | రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *