అక్షరటుడే వెబ్డెస్క్: Rahul Gandhi Gen Z | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ( Himanta Biswa Sarma ) మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని పదే పదే కొత్తగా యువ నాయకుడిగా, ‘జెన్-జీ’ ప్రతినిధిగా పరిచయం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ వయసు పెరిగినా ఆయన కాంగ్రెస్కు ఎప్పటికీ “సదా యువ నాయకుడే” అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.గువాహటీలో మీడియాతో మాట్లాడిన హిమంత.. 57 ఏళ్ల వయసున్న వ్యక్తిని ఇంకా యువకుడిగా చూపించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తన వయసు కూడా 57 ఏళ్లేనని, ఆ లెక్కన తాను కూడా ‘జెన్-జీ’ అని చెప్పుకోవచ్చని చమత్కరించారు.
Rahul Gandhi Gen Z | ఓటములు ఎదురైనప్పుడల్లా ..
రాజకీయంగా ఎదురుదెబ్బలు తగిలినప్పుడల్లా రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లిపోతారని హిమంత ఆరోపించారు. అక్కడ కొన్ని రోజులు గడిపి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ నాయకత్వం ఆయనను మళ్లీ కొత్త రూపంలో రీ-లాంచ్ చేయడానికి ప్రయాసపడుతుందని విమర్శించారు. దేశంలో ఎప్పుడు రాజకీయ గందరగోళం నెలకొన్నా ఆయన విదేశాలకు వెళ్లడం పరిపాటిగా మారిందన్నారు.
Rahul Gandhi Gen Z | తీవ్ర విమర్శలు..
ఇటీవల రాహుల్ గాంధీ చేపట్టిన వియత్నాం పర్యటనపై కూడా బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భారత్లో అస్థిరతను ప్రేరేపించే వ్యక్తులను, శక్తులను కలవడానికే ఆయన వియత్నాం వెళ్లారని బీజేపీ ఆరోపణలు చేస్తోందని హిమంత గుర్తుచేశారు. దేశ ప్రయోజనాలను పక్కనపెట్టి, పదే పదే విఫలమైన నాయకుడిని రుద్దేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆయన మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: Sircilla White Coat Ceremony | ఉత్తమ వైద్య సేవలతో ఉన్నత స్థానాలకు ఎదగాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్