అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: PM Rahat Scheme | రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించడంలో పీఎం రాహత్ పథకం కీలకంగా నిలుస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు (Sanjay Jaju) అన్నారు. పీఎం రాహత్ (ప్రైమ్ మినిస్టర్ రోడ్ ఆక్సిడెంట్ విక్టిమ్స్ హాస్పిటలిజేషన్ అండ్ అస్యూర్డ్ ట్రీట్మెంట్) పథకం అమలుపై కలెక్టర్ ఇలా త్రిపాఠితో (Collector Ila Tripathi) వీసీలో మాట్లాడారు.
PM Rahat Scheme | సకాలంలో వైద్యసేవలు అందించడం..
కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే బాధితుడిని ఆస్పత్రిలో చేర్పించడానికి పోలీస్ ఆమోదిత కేసులకు గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు పూర్తి చికిత్స అందించే అవకాశం ఉంటుందన్నారు. ప్రమాదం తర్వాత బాధితుల ప్రాణాలు కాపాడేందుకు గోల్డెన్ అవర్ (Golden Hour Treatment) ఎంతో కీలకమన్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సేవలు అందించి, వారి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయాలన్నారు. వీసీలో అదనపు కలెక్టర్లు రాజాగౌడ్, భుజంగరావు, జిల్లా రవాణా శాఖ అధికారి రమేష్ రాథోడ్, వైద్యారోగ్య శాఖ అధికారిణి రాజశ్రీ, జీజీహెచ్ సూపరింటెండెంట్ రాములు, జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త శ్రీనివాస్ ప్రసాద్, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఈ-దార్ జిల్లా మేనేజర్ వర్ష నిహంత్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: యూట్యూబ్ లవర్స్‌కి పండగే.. ఇక యాడ్స్‌కు బైబై!