జాతీయంVijay Swearing-In | విజయ్​ ప్రమాణ స్వీకారం.. ప్రత్యేక ఆకర్షణగా త్రిష

Vijay Swearing-In | విజయ్​ ప్రమాణ స్వీకారం.. ప్రత్యేక ఆకర్షణగా త్రిష

తమిళనాడు ముఖ్యమంత్రి టీవీకే అధినేత జోసెఫ్​ విజయ్​ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకలో నటి త్రిష కృష్ణన్ అందరి దృష్టిని ఆకర్షించారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vijay Swearing-In | తమిళనాడు ముఖ్యమంత్రి టీవీకే (TVK) అధినేత జోసెఫ్​ విజయ్​ ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ వేడుకకు రాజకీయ ప్రముఖులే కాకుండా, సినీ తారలు కూడా హాజరయ్యారు. వీరిలో, విజయ్ సన్నిహిత మిత్రురాలు, నటి త్రిష కృష్ణన్ ( Actress Trisha) అందరి దృష్టిని ఆకర్షించారు.

త్రిష తన తల్లి ఉమా కృష్ణన్‌తో కలిసి ఈ కార్యక్రమానికి విచ్చేశారు. లేత నీలం రంగు పట్టు చీర ధరించి, మల్లెపూలతో అలంకరించుకుని సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న త్రిషను చూసి అభిమానులు హర్షధ్వానాలు చేశారు. స్టేడియంలోకి ప్రవేశిస్తూ అభిమానులకు అభివాదం చేస్తూ, చిరునవ్వులు చిందిస్తున్న త్రిష వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Vijay Swearing-In | ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా

ఎన్నికల్లో విజయ్ తిరుచ్చి, పెరంబూరు నియోజకవర్గాల నుంచి విజయం సాధించారు. ఆయన పెరంబూర్​ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగనున్నారు. తిరిచ్చి స్థానానికి రాజీనామా చేయనున్నారు. ఆ స్థానం నుంచి త్రిష TVK అభ్యర్థిగా పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్రిష పోటీకి సంబంధించి ఇప్పటివరకు TVK పార్టీ గానీ, స్వయంగా త్రిష గానీ ఎటువంటి అధికారిక స్పష్టత ఇవ్వలేదు.

Vijay Swearing-In | జయలలిత అవుతారా

గతంలో సినీ నటుడు ఎంజీఆర్ (MGR)​ అన్నా డీఎంకే పార్టీని స్థాపించారు. ఆ సమయంలో ఆయన వెంట సినీ నటి జయలలిత ఉన్నారు. అనంతరం ఆమె పార్టీలో కీలకంగా ఎదిగారు. పలుమార్లు సీఎంగా పని చేశారు. ప్రస్తుతం మరో నటుడు విజయ్​ సీఎం కావడం, ఈ సమయంలో త్రిష ఆయనతో ఉండటంతో తమిళనాడు రాజకీయాలు, సోషల్​ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఆమె మరో జయలలిత (Jayalalitha) అవుతారంటూ పలువురు సోషల్​ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రానున్న రోజుల్లో ఆమె రాజకీయ జీవితంపై స్పష్టత రానుంది.

దీనిని కూడా చదవండి : CM Vijay | విజయ్​ అను నేను.. ప్రమాణ స్వీకారం చేసిన టీవీకే అధినేత

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Vijay Welfare Schemes| ముఖ్యమంత్రిగా విజయ్ తొలి అడుగు.. ఉచిత విద్యుత్, ఫ్రీ బస్ ప్రయాణంపై తొలి సంతకాలు

అక్షరటుడే వెబ్‌డెస్క్:Vijay Welfare Schemes| తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన...

Tractor Tyre Blast | ట్రాక్టర్ టైర్​ పేలి​.. నలుగురికి గాయాలు

అక్షరటుడే, ఆర్మూర్​: Tractor Tyre Blast | ట్రాక్టర్ టైర్ పేలి(tractor...

Inter Admissions | య‌థావిధిగా ఇంట‌ర్ అడ్మిష‌న్లు.. సీఎం కీలక ఆదేశాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Inter Admissions | ఇంటర్​ ప్రవేశాలపై సీఎం...

Royal Enfield Brand | ‘బుల్లెట్’ స్పీడ్​తో పైపైకి.. ప్రపంచంలోనే 3వ స్ట్రాంగెస్ట్ ఆటో బ్రాండ్​గా గుర్తింపు..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Royal Enfield Brand | ప్రముఖ భారతీయ ద్విచక్ర...