అక్షరటుడే వెబ్‌డెస్క్: Priyanka Gandhi ECI | దేశంలో ఎన్నికల నిర్వహణ తీరు, ఓటరు జాబితాల రూపకల్పనపై వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేరళలోని కల్పట్టలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ప్రజాస్వామ్య ప్రక్రియతో ఆడుకునే ఏ ఒక్కరైనా దేశద్రోహానికి పాల్పడినట్లేనని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరించే వారికి ఎలాంటి చట్టపరమైన రక్షణలు ఉండకూడదని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాలను తారుమారు చేయడం, ఏకంగా 13 కోట్ల మంది ఓటర్ల పేర్లను తొలగించడం వంటి చర్యలు రాజ్యాంగానికి, దేశ సమగ్రతకు వ్యతిరేకంగా చేసిన క్షమించరాని నేరాలని ప్రియాంక ఆరోపించారు.
Priyanka Gandhi ECI | క్రిమినల్ చర్యలు తీసుకోవాలి..
చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడే ఎన్నికల కమిషనర్‌కు రాజ్యాంగపరమైన రక్షణ కల్పించాల్సిన అవసరం లేదని ఆమె తేల్చిచెప్పారు. భారీ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయని తోటి అధికారులే ఆయన దృష్టికి తెచ్చినా, ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహించి పక్షపాత ఎన్నికలకు దారితీశారని విమర్శించారు. సాధారణ నేరస్థుడిని ఎలాగైతే విచారిస్తారో, రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన ఎన్నికల కమిషనర్‌పై కూడా అదే రీతిలో క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపట్టి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల పారదర్శకతపై ప్రియాంక చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Anybody who plays around with the democratic process of our elections is committing treason against this nation. The Election Commissioner should be prosecuted for treason. pic.twitter.com/ZSMBX9qcpw
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) September 24, 2026
ఇది కూడా చదవండి: Mallesh Weapons Theft Case | బొల్లారం ఆయుధాల చోరీ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి..!