క్రైంFrance Abuse Case | ఫ్రాన్స్‌లో దారుణం.. ప్రేయసిని 487 మందికి అమ్మేసిన బ్యాంక్...

France Abuse Case | ఫ్రాన్స్‌లో దారుణం.. ప్రేయసిని 487 మందికి అమ్మేసిన బ్యాంక్ మేనేజర్

ఫ్రాన్స్‌లో మానవత్వాన్ని నిలువునా పూడ్చిపెట్టే ఘోరమైన ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో ఓ యువతిని నమ్మించిన బ్యాంక్ మేనేజర్.. ఆమెకు ఏడేళ్ల పాటు నరకం చూపించాడు.

అక్షరటుడే వెబ్‌డెస్క్: France Abuse Case | ఫ్రాన్స్‌లో (France)  మానవత్వాన్ని నిలువునా పూడ్చిపెట్టే ఘోరమైన ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో ఓ యువతిని నమ్మించిన బ్యాంక్ మేనేజర్.. ఆమెకు ఏడేళ్ల పాటు నరకం చూపించాడు. ఏకంగా 487 మందికి పైగా కామాంధులకు ఆమెను విక్రయించి, ఆ పైశాచికత్వాన్ని చూసి వికృతానందం పొందాడు. చివరికి బాధితురాలు ధైర్యం చేసి కోర్టు మెట్లు ఎక్కడంతో ఈ ఘోరం బయటపడింది.

France Abuse Case | 2015 నుంచి సాగిన నరకయాతన..

అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ‘గిల్లౌమ్‌ బూచి’ అనే బ్యాంకర్ 2015 నుంచి 2022 వరకు ఒక మహిళతో సహజీవనం (రిలేషన్) సాగించాడు. ఆ సమయంలో ఆమెను గదిలో బంధించి, విపరీతంగా కొడుతూ క్రూరంగా ప్రవర్తించేవాడు. క్రమక్రమంగా ఆమెను మానసికంగా బ్లాక్‌మెయిల్ చేస్తూ.. వ్యభిచార ఊబిలోకి నెట్టేశాడు. తన ఆఫీస్ సహోద్యోగులు, స్నేహితులు , ఆన్‌లైన్ ద్వారా పరిచయమైన వ్యక్తులకు ఆమెను విక్రయించడం మొదలుపెట్టాడు.

france.1

France Abuse Case | బాధితురాలి వాంగ్మూలం..

“వారిలో కొందరిని నేను పదిసార్లకు పైగా చూడాల్సి వచ్చింది. దాదాపు 487 మంది వరకు లెక్కపెట్టాను.. ఆ తర్వాత నరకం భరించలేక లెక్కపెట్టడం కూడా మానేశాను” అంటూ బాధితురాలు కోర్టులో కన్నీరుమున్నీరైంది.

France Abuse Case | కాన్పు అయిన రోజే ట్రక్ డ్రైవర్‌కు అమ్మకం..

బాధితురాలు వెల్లడించిన మరికొన్ని నిజాలు కోర్టును సైతం విస్మయానికి గురిచేశాయి. 2017లో ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చి, హాస్పిటల్ నుంచి డిశ్ఛార్జ్ అయిన రోజే.. ఆ నిందితుడు ఆమెను ఒక ట్రక్ డ్రైవర్‌కు అమ్మేశాడు. “ఆ సమయంలో నేను మానసికంగా చనిపోయాను. ఒకవేళ అతడిని ఎదిరిస్తే నా అంతరంగిక వీడియోలను ఆన్‌లైన్‌లో పెడతానని భయపెట్టేవాడు. ఆ భయంతోనే ఇన్నేళ్లు భరించాను” అని ఆమె తెలిపింది. ఈ క్రూరమైన హింస కారణంగా ప్రస్తుతం ఆమె తీవ్రమైన శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతోందని తెలిపింది.

france

France Abuse Case | కోర్టు సంచలన తీర్పు..

విచారణలో భాగంగా నిందితుడు పంపిన వాయిస్ మెసేజ్‌లు, టెక్స్ట్ మెసేజ్‌లను పరిశీలించిన న్యాయస్థానం.. అతడి అరాచకాలను నిర్ధారించింది. అయితే, నిందితుడు మాత్రం ఇదంతా తన ప్రేయసి ఇష్టపూర్వకంగానే చేసిందంటూ కోర్టులో బుకాయించే ప్రయత్నం చేశాడు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. నిందితుడైన బ్యాంక్ మేనేజర్‌కు 25 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చారు.

ఇది కూడా చదవండి:  Karnataka CM Change | కర్ణాటక రాజకీయంలో బిగ్ ట్విస్ట్.. రేపే సీఎం సిద్ధరామయ్య రాజీనామా!

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Minister Quarters Swimming Pool | ఒలింపిక్స్‌లో ‘మినిస్టర్’ మెడల్ పక్కా? క్వార్టర్స్‌లో రూ.2.63 కోట్లతో స్విమ్మింగ్ పూల్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Minister Quarters Swimming Pool | తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను...

Japan Population Crisis | సూర్యుడు ఉదయించే దేశంలో.. శృంగార అస్తమయం!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Japan Population Crisis | జపాన్.. సాంకేతికతకు మారుపేరు....

VH Criticizes Congress Ministers | మంత్రులూ.. పద్ధతి మార్చుకోండి: సొంత ప్రభుత్వంపై ‘వీహెచ్‌’ ఫైర్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: VH Criticizes Congress Ministers | తెలంగాణ రాష్ట్రంలో అధికార...

Hormuz Strait Blockade | హార్ముజ్ జలసంధిపై దిగ్బంధనం ఎత్తివేత.. అమెరికా అధ్యక్షుడు కీలక ప్రకటన

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Hormuz Strait Blockade | వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యం...