తెలంగాణInter Students Breakfast | ఇంటర్​ విద్యార్థులకు టిఫిన్​లో దోశ, పూరీ, ఇడ్లీ

Inter Students Breakfast | ఇంటర్​ విద్యార్థులకు టిఫిన్​లో దోశ, పూరీ, ఇడ్లీ

ప్రభుత్వం ఇంటర్​ విద్యార్థులకు బ్రేక్​ఫాస్ట్​లో దోశ, పూరీ, ఇడ్లీ, మిల్లెట్, బోండా పెట్టాలని నిర్ణయించింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Inter Students Breakfast | రాష్ట్ర ప్రభుత్వం ప్రీ ప్రైమరీ స్థాయి నుంచి ఇంటర్​ వరకు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు బ్రేక్​ఫాస్ట్​, మధ్యాహ్న భోజనం (Mid Day Meals) అమలు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఉదయం అల్పాహారం (Breakfast)తో పాటు మధ్యాహ్న భోజనం అందించడానికి ఇటీవల మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఇంటర్​ విద్యార్థులకు రోజు ఒకేరకమైన బ్రేక్​ఫాస్ట్​ కాకుండా వెరైటీలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టిఫిన్​లో దోశ, పూరీ, ఇడ్లీ, మిల్లెట్, బోండాపెట్టాలని భావిస్తోంది. వ‌య‌సుకు త‌గిన పోష‌కాలు అందేలా పథకాన్ని రూపొందిస్తోంది. దీంతో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న 1.92 ల‌క్షల మంది విద్యార్థుల‌కు ప్రయోజ‌నం కలగనుంది. ఇంటర్​ విద్యార్థులకు మ‌ధ్యాహ్న భోజ‌నం, బ్రేక్‌ఫాస్ట్‌కు ఏటా రూ.180 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పథకాన్ని జూన్​ 12న సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించనున్నారు.

Inter Students Breakfast | సక్రమంగా అమలయ్యేనా..

ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలి. అయితే రాష్ట్రంలో ఏ బడిలో కూడా మెనూ సక్రమంగా అమలు కావడం లేదు. నీళ్ల చారుతో సరిపెడుతున్నారు. కూరలు సరిగా వండటం లేదు. అన్నం, కూరల్లో పురుగులు వచ్చిన ఘటనలు ఉన్నాయి. మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం అమలు చేసే బ్రేక్​ఫాస్ట్ పథకాన్ని సక్రమంగా అమలు చేస్తారా లేదో చూడాలి.

students 2

Inter Students Breakfast | టిఫిన్​ మెనూ

ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్థుల‌కు బ్రేక్‌ఫాస్ట్, మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కాన్ని జూన్​ 12న ప్రారంభిస్తారు. తొలి రోజు 41,250 మంది విద్యార్థులకు బ్రేక్​ఫాస్ట్​, భోజనం అందించనున్నారు. దోశ‌+చ‌ట్నీ, మిల్లెట్ ఇడ్లీ+సాంబార్‌, +మిక్స్‌డ్ వెజిటెబుల్ కుర్మా, బోండా+చ‌ట్నీ, ఇడ్లీ+చ‌ట్నీ, ఉప్మా+చ‌ట్నీ/ సాంబార్‌ టిఫిన్​గా అందించనున్నారు. అంతేగాకుండా రోజు విడిచి రోజు 150 మిల్లిలీటర్ల పాలు కూడా విద్యార్థులకు ఇవ్వనున్నారు.

దీనిని కూడా చదవండి : Panipuri Food Poisoning | పానీపూరి తిని 25 మందికి తీవ్ర అస్వస్థత

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

May 30 Horoscope | కష్టాలకు ఇక ఎండ్​ కార్డ్​.. ఈ రాశుల వారికి నేడు ఆకస్మిక ధన యోగం!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 30 Horoscope | గ్రహాల సంచారంలో వస్తున్న...

Minister Quarters Swimming Pool | ఒలింపిక్స్‌లో ‘మినిస్టర్’ మెడల్ పక్కా? క్వార్టర్స్‌లో రూ.2.63 కోట్లతో స్విమ్మింగ్ పూల్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Minister Quarters Swimming Pool | తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను...

Japan Population Crisis | సూర్యుడు ఉదయించే దేశంలో.. శృంగార అస్తమయం!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Japan Population Crisis | జపాన్.. సాంకేతికతకు మారుపేరు....

VH Criticizes Congress Ministers | మంత్రులూ.. పద్ధతి మార్చుకోండి: సొంత ప్రభుత్వంపై ‘వీహెచ్‌’ ఫైర్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: VH Criticizes Congress Ministers | తెలంగాణ రాష్ట్రంలో అధికార...