KTR Allegations | మంత్రుల అవినీతి దందా : కేటీఆర్

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: KTR Allegations | మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy)పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రెవెన్యూ పడిపోతుంది కానీ రెవెన్యూ మంత్రి అవినీతి సామ్రాజ్యం వందల వేల రెట్లు పెరిగిపోయిందని ఆరోపించారు.

పాలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ (BRS Party) కార్యకర్తల సమావేశంలో కేటీఆర్​ మాట్లాడారు. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది కానీ రాష్ట్ర ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం భట్టి ఆదాయం, కమీషన్ దందాలు మాత్రం జోరుగా సాగుతున్నాయన్నారు. పొంగులేటి ఎంత సంపాదించాడంటే.. నోట్లు లెక్కపెట్టే మెషీన్లు కూడా అలసిపోతున్నాయని ఆరోపించారు. రెండేళ్ల కింద ఈడీ దాడి చేసి పట్టుకున్న వందల కోట్ల రూపాయల పైన కనీసం ప్రకటన లేదన్నారు. బీజేపీతో పొంగులేటికి ఉన్న లాలూచీ కారణంగానే ఈడీ ఆయన పైన కేసు పెట్టలేదని చెప్పారు.

KTR Allegations | వివాదాస్పద జాబితాలో పెట్టి..

తెలంగాణలో కోటి ఎకరాల భూములను వివాదాస్పద జాబితాలో పెట్టి వాటిని పొంగులేటి దోచుకుంటున్నారని కేటీఆర్​ ఆరోపించారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) దొంగ అయితే పొంగులేటి గజదొంగ మాదిరిగా మారారని విమర్శించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీసీ మంత్రి కొండా సురేఖను మాట్లాడనియ్యకుండా మైక్ కట్ చేశారని చెప్పారు. పక్కన ఉన్న మరో బీసీ మంత్రి శ్రీహరి మీద కాగితాలు విసిరేశారన్నారు. ఎంత అహంకారం కాకుంటే తోటి మంత్రులతో అలా ప్రవర్తిస్తారని ప్రశ్నించారు.

KTR Allegations | ఆ మాట మీద నిలబడతావా..

హౌసింగ్ మంత్రిగా 20 లక్షల ఇండ్లు కడితేనే ఓట్లు అడుగుతా అని పొంగులేటి అన్నట్లు కేటీఆర్​ గుర్తు చేశారు. ఆ మాట మీద నిలబడే సత్తా ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్​ రెండున్నరేళ్ల పాలన పూర్తయిందని, 10 లక్షల ఇండ్లు కట్టారా అని ప్రశ్నించారు. ‘‘నీకు ఇల్లు కట్టే తెలివి ఎక్కడిది, వెలుగుమట్ల మాదిరి ఇండ్లు కూలగొట్టడం, విధ్వంసం తప్ప వికాసం తెల్వదు” అని కేటీఆర్​ పొంగులేటిపై విరుచుకుపడ్డారు.

KTR Allegations | భూమి శిస్తు పేరిట.

కాంగ్రెస్ రైతుల నుంచి పీల్చి పిండుకున్న భూమి శిస్తును కేసీఆర్ తీసేశారని కేటీఆర్​ చెప్పారు. కానీ కాంగ్రెస్ మళ్ళీ భూమి శిస్తు పెట్టి రైతులను వేధించేందుకు సిద్ధమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి శిస్తు పేరుతో రైతుల నుంచి ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తారా అన్నారు. ములుగు జిల్లాలో పొంగులేటి వేల కోట్ల ఇసుక దందా కోసం స్కెచ్ వేశారని, చివరికి సమ్మక్క సారలమ్మ జాతర్ల టెండర్లను కూడా పొంగులేటి వదిలిపెట్టలేదని విమర్శించారు.

ఇది కూడా చదవండి..: Harish Rao Criticism | పిల్లల ముందు రాజకీయాలేనా.. సీఎంపై హరీశ్​రావు విమర్శలు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *