అక్షరటుడే, వెబ్‌డెస్క్: Harish Rao Criticism | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. పిల్లల ముందు కూడా రాజకీయాలేనా అని ప్రశ్నించారు. ఆరుట్ల స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో విద్యార్థుల సమక్షంలో రాజకీయ వ్యాఖ్యలు చేశారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
హరీశ్ రావు తాటిచెట్టు లెక్క పెరిగాడు అంటూ పిల్లల ముందు మాట్లాడటం సరైందేనా అని ఆయన అన్నారు. రైతుబంధు, రైతు భీమా, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి ప్రజా సమస్యలపై సమాధానం చెప్పకుండా వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. నా ఎత్తు గురించి ఆ పిల్లలకు ఎందుకు రేవంత్ రెడ్డి అని నిలదీశారు. తనను ఎన్ని మాటలు అన్నా కూడా ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.
Harish Rao Criticism | కార్పొరేషన్లకు నిధులు లేవు
సీఎం రేవంత్‌రెడ్డి 33 కులాలకు 33 కార్పొరేషన్లు వేశారు కానీ ఒక్కరికి ఒక్క రూపాయి కూడా సాయం అందలేదని హరీశ్‌రావు అన్నారు. కార్పొరేషన్లకు మాత్రం ఛైర్మన్లను పెట్టి వాళ్లకు ఒక కారు, ప్యూన్, ఫ్యాన్ ఇచ్చాడు అంతే తప్ప ఎవరికి ఒక్క రూపాయి కూడా సాయం జరగలేదని విమర్శించారు. అధికారులు తన మాట వినట్లేదని సీఎం అంటున్నారని ఆయన పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డికి చేతగాక అధికారుల మీద ఏడిస్తే ఎట్ల అని ఎద్దేవా చేశారు.
ఇది కూడా చదవండి..: Kavitha Singareni Comments | తెలంగాణ ఇజ్జత్ తీస్తున్న సీఎం.. కవిత సంచలన వ్యాఖ్యలు