Mohan Naik Arrest | ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ మోహన్‌ నాయక్‌కు 14 రోజుల రిమాండ్‌

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రోడ్లు, భవనాల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (ENC) మోహన్‌నాయక్‌ను ఏసీబీ (ACB) అధికారులు అరెస్ట్ చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Mohan Naik Arrest | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రోడ్లు, భవనాల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (ENC) మోహన్‌నాయక్‌ను ఏసీబీ (ACB) అధికారులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఆయనకు చెందిన 16 చోట్ల అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించగా, భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి.

Mohan Naik Arrest | కేసు వివరాలు..

సోదాల్లో సుమారు రూ. 17.94 కోట్ల విలువైన అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే, బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ సుమారు రూ. 150 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

acb.1 2

రిమాండ్..

అరెస్ట్ చేసిన అనంతరం మోహన్‌నాయక్‌ను ఏసీబీ అధికారులు బుధవారం కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు న్యాయస్థానం ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాలతో అధికారులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. అవినీతి ఆరోపణలతో ప్రభుత్వ శాఖలో కీలక పదవిలో ఉన్న అధికారి అడ్డంగా దొరికిపోవడం ఇప్పుడు సంచలనంగా మారింది.

ఇది కూడా చదవండి:  Nizamabad Electric Bus | సాంకేతిక లోపంతో ఆగిన ఎలక్ట్రిక్​​ బస్సు.. సీపీ ఆఫీస్​ వద్ద ట్రాఫిక్​జాం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *