Stock Market Gains | భారీ లాభాల్లో సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో కొనసాగుతోంది. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 538 పాయింట్లు, నిఫ్టీ 147 పాయింట్ల లాభంతో ఉన్నాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Gains | అమెరికా, ఇరాన్‌ల మధ్య దాడులు, ప్రతిదాడులతో గ్లోబల్ మార్కెట్లు (Global Markets) నష్టాల బాటలో సాగుతున్నాయి. అయితే దేశీయ స్టాక్ మార్కెట్ మాత్రం లాభాలతో కొనసాగుతోంది.

బుధవారం ఉదయం సెన్సెక్స్ 70 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 8 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో కొంత అమ్మకాల ఒత్తిడికి గురయినా తర్వాత పుంజుకుని లాభాలను పెంచుకున్నాయి. ఇండెక్స్ హెవీవెయిట్ స్టాక్స్ అయిన రిలయన్స్‌తోపాటు ఐసీఐసీఐ బ్యాంక్, ఎఫ్ఎంసీజీ కంపెనీలు రాణిస్తుండడంతో భారీ లాభాల దిశగా సాగుతున్నాయి. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 538 పాయింట్ల లాభంతో 74,457 వద్ద, నిఫ్టీ 147 పాయింట్ల లాభంతో 23,389 వద్ద ఉన్నాయి.

Stock Market Gains | మిక్స్‌డ్‌గా సూచీలు..

ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 1.65 శాతం, ఫార్మా 0.67 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 0.57 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.46 శాతం లాభాలతో ఉండగా.. టెలికాం 1.36 శాతం, మీడియా 1.11 శాతం, మెటల్ 0.93 శాతం, పవర్ 0.34 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 22 స్టాక్స్ లాభాలతో, 8 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. హెచ్యూఎల్ 2.66 శాతం, ట్రెంట్ 2.19 శాతం, కొటక్ బ్యాంక్ 2.12 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 2.05 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.58 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : అల్ట్రాటెక్ సిమెంట్ 0.58 శాతం, టాటా స్టీల్ 0.57 శాతం, ఎటర్నల్ 0.49 శాతం, ఎంఅండ్ ఎం 0.29 శాతం, టెక్ మహీంద్రా 0.17 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: CMR Green IPO | అ‘ధర’గొట్టిన ఐపీవో.. 43 శాతం లాభాలతో లిస్టయిన ‘సీఎంఆర్’

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *