Maruti Car Sales | ‘మారుతి’కి ఎదురేదీ?.. టాప్-10లో ఆరు ఈ కంపెనీ మోడళ్లే..

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Maruti Car Sales | కొవిడ్ తర్వాత దేశంలో కార్ల కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయి. గతేడాది సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం (Central Government) జీఎస్టీ సంస్కరణలను అమలు చేసిన తర్వాత ఈ జోరు మరింత పెరిగింది.

కార్ల ధరలు గణనీయంగా తగ్గి సామాన్యులకు కూడా అందుబాటులోకి రావడంతో సేల్స్ క్రమంగా పెరుగుతున్నాయి. గతేడాది మే నెలలో మొత్తం డొమెస్టిక్ ప్యాసింజర్ వెహికిల్ సేల్స్ 3.51 లక్షల యూనిట్లు కాగా.. ఇది ఈ ఏడాది మే నాటికి 4.40 లక్షల యూనిట్లకు చేరింది. అంటే వార్షిక ప్రాతిపదికన 25 శాతం సేల్స్ పెరిగాయి.

Maruti Car Sales | 2.42 లక్షల యూనిట్లతో..

Maruti Car Sales

మార్కెట్‌ను క్యాష్ చేసుకోవడంలో దేశంలోనే అతిపెద్ద కంపెనీ అయిన మారుతి సుజుకీ (Maruti Suzuki) ఇండియా ముందుంది. ఈ కంపెనీ గతనెలలో 2,42,688 యూనిట్ల కార్లను విక్రయించింది. ఒక నెలలో కార్ల విక్రయాల్లో ఇప్పటివరకు ఇదే రికార్డ్ కావడం గమనార్హం. 59,090 యూనిట్ల అమ్మకాలతో టాటా మోటార్స్ ద్వితీయ స్థానంలో ఉంది.

Maruti Car Sales | టాప్ లో ‘డిజైర్’..

దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లలో మారుతి సుజుకీ డిజైర్ ముందుంటుంది. సేల్స్ దీనిని ఢీకొట్టే కారు సమీపంలో మరేదీ కనిపించడం లేదు. గతనెలలో ఈ కాంపాక్ట్ సెడాన్ మోడల్ 24,546 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఏప్రిల్‌లోనూ ఇదే టాప్‌లో ఉంది. ఆ నెలలో 23,580 యూనిట్లను విక్రయించింది. గత ఆర్థిక సంవత్సరం మొత్తంలో 2,29,130 డిజైర్ కార్లు అమ్ముడవడం గమనార్హం.

Maruti Car Sales | 2, 3 స్థానాల్లోనూ ఇదే కంపెనీ మోడళ్లు..

దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల మోడళ్లలో రెండు, మూడు స్థానాల్లోనూ మారుతి ఉత్పత్తులే ఉన్నాయి. 20,686 యూనిట్ల అమ్మకాలతో ఫ్రాంక్స్ ద్వితీయ స్థానంలో, 20,350 యూనిట్లతో ఎర్టిగా మూడో స్థానంలో నిలిచాయి.

Maruti Car Sales | నాలుగు, ఐదు స్థానాల్లో టాటా కార్లు..

టాటా మోటార్స్ కార్లు టాప్ -5లో చోటు సంపాదించుకున్నాయి. 20,208 యూనిట్ల అమ్మకాలతో టాటా పంచ్ నాలుగో స్థానంలో, 19,100 యూనిట్లతో టాటా నెక్సాన్ ఐదో స్థానంలో ఉన్నాయి.

6, 7, 8 స్థానాలూ మారుతివే..

దేశంలో అమ్మకాల పరంగా ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో మారుతి ఉత్పత్తులైన బాలెనో, వ్యాగన్ ఆర్, స్విఫ్ట్ నిలిచాయి. బాలెనో 18,396, వ్యాగన్ ఆర్ 18,076, స్విఫ్ట్ 17,519 యÖనిట్ల విక్రయాలు జరిగాయి.

తొమ్మిదో స్థానంలో మహీంద్రా..

మహీంద్రా స్కార్పియో తొమ్మిదో స్థానంలో ఉంది. ఈ మోడల్ కార్లు 15,774 యూనిట్లు అమ్ముడయ్యాయి.

పదో స్థానంలో హ్యుందాయ్..

హ్యుందాయ్ క్రెటా పదో స్థానంలో ఉంది. 15,235 యూనిట్ల విక్రయాలు జరిగాయి.

ఇది కూడా చదవండి..: June 05 Gold Prices | హెచ్చుతగ్గుల దోబూచులాటలో పసిడి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *