Ramalinga Reddy Resignation | రెండు రోజులకే రాజీనామా చేసిన కర్ణాటక మంత్రి..

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ramalinga Reddy Resignation | కర్ణాటక కాంగ్రెస్​లో అసంతృప్తి జ్వాలలు మొదలయ్యాయి. సీఎం డీకే శివకుమార్ ప్రభుత్వంలో రెండు రోజుల క్రితం మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రామలింగారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ఆశించిన శాఖను కేటాయించకపోవడంతో రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

Ramalinga Reddy Resignation

కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) ఈ నెల 3న డీకే శివకుమార్​ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు 13 మంది మంత్రులు ప్రమాణం చేశారు. వారిలో శాఖల కేటాయింపుపై రామలింగా రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ఆయనకు ఇరిగేషన్ శాఖను కేటాయించారు. బెంగళూరు నగర అభివృద్ధి శాఖను రామలింగారెడ్డి ఆశించారు. ఈ క్రమంలో తనకు వేరే శాఖ ఇవ్వడంతో అసంతృప్తితో రాజీనామా చేశారు. ఇవాళ బెంగళూరుకు రాహుల్ గాంధీ (Rahul Gandhi) రానున్నారు. ఖర్గే రాజ్యసభ నామినేషన్‌కు ఆయన హాజరు అవుతారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ ముందుకు రామలింగా రెడ్డి పంచాయితీ రానుంది.

Ramalinga Reddy Resignation

Ramalinga Reddy Resignation | మనస్సాక్షికి వ్యతిరేకంగా..

నేను నా మనస్సాక్షికి వ్యతిరేకంగా పనిచేయలేను కాబట్టి నా పదవికి రాజీనామా చేస్తున్నాను అని బెంగళూరులో జరిగిన ఒక విలేకరుల సమావేశంలో రామలింగారెడ్డి అన్నారు. తనకు బెంగళూరు అభివృద్ధి శాఖ కావాలని, కానీ దానికి బదులుగా భారీ, మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టుల మంత్రిగా నియమించారని అన్నారు. ఈ అవమానాన్ని నేను ఇంకెంతకాలం భరించగలను. నా ముందు ఇంకేం అవకాశాలు ఉన్నాయి అని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి..: RBI Monetary Policy | అందరి చూపు ఆర్బీఐ వైపు..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *