అక్షరటుడే వెబ్‌డెస్క్: Ownly Ganesh Chaturthi | వినాయక చవితి పండుగ సందర్భంగా హైదరాబాద్ ( Hyderabad )నగర వాసులను సరికొత్తగా అలరించేందుకు ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ ‘ఓన్లీ’ (Ownly – ర్యాపిడో సంస్థ ప్రత్యేక ఫుడ్ డెలివరీ యాప్) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వినాయకుడి నమ్మకమైన వాహనమైన మూషకుడికి డెలివరీ యుగానికి తగిన ఆధునిక రూపాన్ని ఇస్తూ “మూషక ఆన్ వీల్స్: బాప్పాస్ డెలివరీ పార్టనర్” పేరుతో ఈ ప్రత్యేక క్యాంపెయిన్‌ను నిర్వహిస్తోంది.
Ownly Ganesh Chaturthi | ప్రత్యేక ఆకర్షణగా ..
ఈ కార్యక్రమంలో భాగంగా ఒక ప్రత్యేకంగా అలంకరించిన వ్యాన్‌పై భారీ సైజు మూషక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంచార వాహనం సెప్టెంబర్ 14 నుండి 25 వరకు నగరంలో ప్రయాణించనుంది. ప్రముఖ గణేష్ పందిళ్లు, నివాస ప్రాంతాలు, ప్రధాన రహదారులు , అధిక జనసంచారం ఉండే ప్రాంతాలను ఇది కవర్ చేస్తుంది. ముఖ్యంగా బాలాపూర్, ఓల్డ్ సిటీ, నాగోల్, సికింద్రాబాద్, హైటెక్ సిటీ, మాదాపూర్ , కూకట్పల్లి ప్రాంతాల గుండా ఈ వాహనం వెళ్లేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.
ఈ వ్యాన్ ప్రధానంగా మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు రోడ్లపై తిరుగుతుంది. కుటుంబసభ్యులతో కలిసి పండుగ వేడుకలు, పందిళ్ల సందర్శనకు బయటకు వచ్చే సాయంత్రం వేళల్లో ఇది ప్రజలకు ఎక్కువగా కనిపించనుంది. హైదరాబాద్ వాసులు దీనిని చూసి, ఫొటోలు తీసుకుని సోషల్ మీడియాలో పంచుకునేలా ఈ మూషక ఆన్ వీల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
Ownly Ganesh Chaturthi | సాంస్కృతిక అనుబంధం..
ఈ సందర్భంగా ‘ఓన్లీ’ ప్రతినిధి మాట్లాడుతూ.. వినాయక చవితిని హైదరాబాద్‌లో ఎంతో ఆనందంగా జరుపుకుంటారని, భారతీయ కుటుంబాలలో ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు వినాయకుని నామస్మరణ చేయడం ఆనవాయితీ అని తెలిపారు. వినాయకుడు శుభారంభాలకు సంకేతంగా నిలుస్తూ కొత్త ప్రయాణాలకు సానుకూలతను తెస్తాడని పేర్కొన్నారు.
బప్పా డెలివరీ పార్ట్నర్ అనేది వినాయకుడి నమ్మకమైన సహచరుడైన మూషకుడి సాంస్కృతిక అనుబంధాన్ని, ‘ఓన్లీ’ ఉల్లాసభరితమైన ఆలోచనతో జోడిస్తుందని వెల్లడించారు. నగరమంతా తిరిగే ఈ మూషక ఏర్పాటు ద్వారా వేడుకల్లో మరింత ఆనందాన్ని నింపాలని, హైదరాబాద్ వాసులు గుర్తుంచుకునేలా ఒక మధురమైన పండుగ అనుభవాన్ని సృష్టించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.
Ownly Ganesh Chaturthi | యాప్ ద్వారా ప్రత్యేక సేవలు ..
ఈ ఆన్‌గ్రౌండ్ కార్యక్రమం హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమై ఉన్నప్పటికీ, హైదరాబాద్ , బెంగళూరులలోని యాప్ ద్వారా కూడా పండుగ అనుభవాన్ని ‘ఓన్లీ’ విస్తరించింది. పండుగ ఆర్డర్ల కోసం ప్రత్యేకంగా ఇండియన్ స్వీట్స్ , ప్యూర్ వెజ్ ఐటమ్స్‌ను యాప్‌లో హైలైట్ చేస్తోంది.
వాహనంతో పాటు, ఖైరతాబాద్, బాలాపూర్, మాదాపూర్, మియాపూర్, అమీర్‌పేట్, సికింద్రాబాద్, దిల్సుఖ్ నగర్ , కూకట్పల్లి వంటి ఎంపిక చేసిన గణేష్ పందిళ్ల వద్ద కూడా ఓన్లీ తన బ్రాండింగ్‌ను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా సందర్శకులకు అగర్బత్తీలను పంపిణీ చేస్తూ, స్థానిక స్థాయి గణేష్ చవితి వేడుకల్లో బ్రాండ్ భాగస్వామ్యం అయ్యేలా చూస్తోంది.
గ్రౌండ్లో కనిపించే విజిబిలిటీ, యాప్ ద్వారా కమ్యూనికేషన్ , డిజిటల్ ప్రచారాన్ని జోడించడం ద్వారా వేడుకల్లోని ప్రతిక్షణంలో భాగం కావాలని ఓన్లీ లక్ష్యంగా పెట్టుకుంది. దర్శనాల కోసం బయటికి వెళ్లేటప్పుడు రోడ్డుపై మూషకుడిని చూడటం నుండి, తిరిగి ఇంటికి వచ్చాక ఏది ఆర్డర్ చేయాలి అని కుటుంబాలు నిర్ణయించుకునే వరకు ఈ ప్రచారం తోడ్పడుతుందని సంస్థ పేర్కొంది.
ఇది కూడా చదవండి: Hospital Commission Scam | ఆస్పత్రుల్లో కమీషన్ దందా.. కీలకంగా వ్యవహరిస్తున్న ఆర్ఎంపీ, పీఎంపీలు