అక్షరటుడే వెబ్‌డెస్క్: Rahul Gandhi Satyagraha | దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అన్యాయాలు, ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రజల గొంతుకలను ఏకం చేసేందుకు కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కొత్త అడుగు వేశారు. న్యూఢిల్లీలో ‘సత్యాగ్రహ’ పేరుతో ఒక సరికొత్త డిజిటల్ వేదికను ఆయన అధికారికంగా ప్రారంభించారు. ప్రభుత్వాలను ప్రశ్నించడం, శాంతియుతంగా ప్రతిఘటించడం , ప్రజా సమస్యలను బలంగా వినిపించడమే ఈ ప్లాట్‌ఫామ్ ప్రధాన ఉద్దేశమని ఆయన వెల్లడించారు.
Rahul Gandhi Satyagraha | ప్రజా ఉద్యమాలు..
ఈ వేదిక ద్వారా దేశంలోని ఏ మూలన జరుగుతున్న నిరసనలు, ప్రజా ఉద్యమాల సమాచారాన్ని ఒకే డిజిటల్ మ్యాప్‌పైకి తీసుకువస్తున్నారు. ముఖ్యంగా భూమి హక్కులు, మహిళల భద్రత, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కుల సమస్యలపై ఈ పోర్టల్ ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది. కేవలం సామాజిక అంశాలే కాకుండా, విద్యార్థులను వేధిస్తున్న పరీక్షల నిర్వహణ సమస్యలు, క్వశ్చన్ పేపర్ లీకేజీలు వంటి అంశాలకు కూడా ఈ డిజిటల్ వేదికలో పెద్దపీట వేయనున్నారు.
Rahul Gandhi Satyagraha | రాహుల్ గాంధీ ఏమన్నారంటే..
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. “దేశవ్యాప్తంగా ఎంతోమంది తమ హక్కుల కోసం ఒంటరిగా పోరాడుతున్నారు. ఒంటరిగా లేచే గొంతుకలను అణచివేయడం సులభం, అందుకే వారందరినీ ఒకే తాటిపైకి తెచ్చి సంఘటితం చేయడానికే ఈ సత్యాగ్రహ వేదికను ప్రారంభించాం” అని స్పష్టం చేశారు. ప్రజలు తమ సమస్యల తీవ్రతను బట్టి ఈ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకుంటే, లోక్‌సభ ప్రతిపక్ష నేతగా పార్లమెంట్‌లోనూ, వీధుల్లోనూ వారి తరఫున గట్టిగా పోరాడి న్యాయం జరిగేలా చూస్తానని ఆయన భరోసా ఇచ్చారు.
India is raising its voice against injustice. Now, it’s time to bring those voices together.
From protests over land and women’s rights to the fight for Dalit and OBC rights, education and examinations, people across the country are standing up and fighting for what is right.… pic.twitter.com/ywhHZOh77r
— INC Andhra Pradesh (@INC_Andhra) October 3, 2026
ఇది కూడా చదవండి: Kamareddy Municipality | ఫిర్యాదులు.. ఆపై వసూళ్లు..! కామారెడ్డి బల్దియాలో నయా ట్రెండ్‌కు శ్రీకారం