అక్షరటుడే వెబ్‌డెస్క్: RS Praveen Kumar | బీఆర్‌ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ( RS Praveen Kumar ) వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆయన సెక్యూరిటీని, కారు సౌకర్యాన్ని ప్రభుత్వం తొలగించగా, తాజాగా ఆయన భార్య లక్ష్మీబాయిని ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు వ్యవసాయ శాఖ మార్కెటింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆమెను, కోపరేటివ్ శాఖకు బదిలీ చేశారు.
RS Praveen Kumar | రాజకీయ కక్షసాధింపు..
తన సతీమణి బదిలీపై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్య అని ఆయన మండిపడ్డారు. రాజకీయాల్లోకి వచ్చాక ఇలాంటివి ఎదుర్కోవడానికి సిద్ధపడే వచ్చామని, ప్రభుత్వం తమను ఇబ్బంది పెట్టాలని చూస్తోందని ఆయన ఆరోపించారు.

ప్రభుత్వంపై ఆరోపణలు..
తన భద్రత తగ్గింపుపై హైకోర్టును ఆశ్రయించి పాక్షిక ఉపశమనం పొందానని, అది జీర్ణించుకోలేకే ప్రభుత్వం తన సతీమణిని లక్ష్యంగా చేసుకుందని ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ఆమెకు సంబంధం లేని విభాగానికి బదిలీ చేయడం వెనుక ఉద్దేశ్యం కక్షసాధింపు తప్ప మరొకటి కాదని ఆయన మండిపడ్డారు.
పోరాటం ఆగదు..
ఎన్ని అడ్డంకులు సృష్టించినా, బెదిరింపులకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటామని, వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తేల్చి చెప్పారు.
ఇది కూడా చదవండి: Modi Japan Meeting | ఢిల్లీలో భారత్-జపాన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు..