అక్షరటుడే, ఇందూరు: Vande Mataram | తొలిసారిగా ఎర్రకోటపై వందేమాతరం గీతాలాపన చేయడం శుభ సూచకమని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ (MLA Dhampal Suryanarayana) తెలిపారు. నగరంలో ( Nizamabad) సంస్కార భారతి (Sanskar Bharati), ట్రస్మా సంయుక్త ఆధ్వర్యంలో వందేమాతరం 150 సంవత్సరాల ఉత్సవాలను నగరంలో నిర్వహించారు.
Vande Mataram | వందేమాతరం నినాదం ఒక ఉద్యమ శక్తిగా..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన సమయంలో వందేమాతరం నినాదం ఒక ఉద్యమ శక్తిగా మారిందని అన్నారు. జైలు శిక్షలు వేసినా.. దెబ్బలు, తూటాలు తగిలినా స్వాతంత్య్ర సమరయోధులు ఈ నినాదాన్ని విడిచిపెట్టలేదన్నారు. 150 ఏళ్ల చరిత్రలో ఒక గొప్ప ప్రయాణం వందేమాతరందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వందేమాతరంపై పలు అంశాలపై పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అలాగే కళాభారతి సంబంధించి ఇప్పటికే అనేకసార్లు మంత్రుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. అరకొర నిధుల విడుదలతో ముందుకు సాగడం లేదని తెలిపారు. రాష్ట్ర సంస్కార భారతి బాధ్యులు నిరంజన్ గారు వందేమాతర గీత ప్రాశస్యాన్ని వివరించారు. ఉపన్యాస పోటీలు, వ్యాసరచన పోటీలు, డ్రాయింగ్ కాంపిటీషన్ నృత్య కాంపిటీషన్ ఏకపాత్రాభినయాలు పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అంతకుముందు విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సంస్కార భారతి అధ్యక్షుడు రాజకుమార్ సుభేదర్, ట్రస్మా అధ్యక్షులు కిషోర్, బీజేపీ కార్పొరేటర్లు నాగోళ్ల లక్ష్మీనారాయణ, జ్యోతి మురళి తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్