అక్షరటుడే, మెండోరా: Sriram Sagar Water Level | మహారాష్ట్ర (Maharashtra)లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో శ్రీరాంసాగర్ జలశయానికి వరద తగ్గింది. జిల్లాలోనూ వానలు లేకపోవడంతో స్వల్ప ఇన్ఫ్లో మాత్రమే వస్తోంది.
Sriram Sagar Water Level | 2,450 క్యూసెక్కుల వరద
శ్రీరాంసాగర్ జలాశయానికి ప్రస్తుతం 2,450 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1,079.40 అడుగుల (43.371 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 300 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 482 క్యూసెక్కులు కలిపి మొత్తం 1,013 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది. ఇన్ఫ్లో తగ్గడంతో ప్రాజెక్ట్ నీటిమట్టం నిలకడగా ఉంది.
ఇది కూడా చదవండి: Vande Mataram | తొలిసారిగా ఎర్రకోటపై వందేమాతర గీతాలాపన శుభసూచకం..