అక్షరటుడే, వెబ్డెస్క్: Rain Alert | రాష్ట్రంలో గురువారం తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ రోజు నుంచి తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు తగ్గుముఖం పడుతాయన్నారు.
దక్షిణ, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ సాయంత్ర నుంచి రాత్రి వరకు తేలికపాటి జల్లులు కురుస్తయి. ముఖ్యంగా రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో వర్షం కురిసే ఛాన్స్ ఉంది. మిగతా జిల్లాల్లో వాతవరణం పొడిగా ఉంటుంది. కాగా బుధవారం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మెదక్ జిల్లాలో వాన దంచికొట్టింది. సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి.
Rain Alert | రైతులకు అలర్ట్
తెలంగాణ (Telangana)లో నేటి నుంచి వర్షాలు తగ్గుముఖం పడుతాయని అధికారులు పేర్కొన్నారు. రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆగస్టు 20 వరకు వర్షాలకు విరామం వస్తుందని తెలిపారు. కాగా ఇప్పటికే కురిసిన వర్షాలతో రైతులు భారీ విస్తీర్ణంలో వరి సాగు చేశారు. అయితే రానున్న రోజుల్లో వానలు తక్కువగా పడుతాయని, పంటలను కాపాడుకోవడానికి చర్యలు తీసుకోవాలన్నారు.
ఇది కూడా చదవండి..: Rega Kantharao Arrest | మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెస్టు.. BRS అధిష్ఠానం వైఖరి ఏమిటో!