School Recognition | గౌతమ్ మోడల్ పాఠశాల గుర్తింపును రద్దు చేయాలి

కామారెడ్డి పట్టణంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్న గౌతమ్ మోడల్ స్కూల్ గుర్తింపును రద్దుచేసి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని భారతీయ విద్యార్థి సంఘం జిల్లా ఇన్​ఛార్జి విఠల్ డిమాండ్ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: School Recognition | పట్టణంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్న గౌతమ్ మోడల్ స్కూల్(Gautam Model School) గుర్తింపును రద్దుచేసి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని భారతీయ విద్యార్థి సంఘం జిల్లా ఇన్​ఛార్జి విఠల్ డిమాండ్ చేశారు. గురువారం భారతీయ విద్యార్థి సంఘం నాయకులు (Kamareddy)పాఠశాల ఫ్లెక్సీలు, కరపత్రాలను చింపివేసి దహనం చేశారు.

School Recognition | అనుమతి లేకుండానే పాఠశాల షిఫ్ట్​..

ఈ సందర్భంగా విఠల్, ఆర్బాస్ ఖాన్ మాట్లాడుతూ.. అనుమతులు లేకుండానే పాఠశాలను షిఫ్ట్ చేయడం, ప్రైమరీ విద్యార్థులకు రెండో అంతస్తులో తరగతులు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. లిఫ్టు వాడకంతో చిన్నారులకు ప్రమాదం పొంచి ఉందని, అధిక ఫీజులు వసూలు చేస్తూ పాఠశాల ప్రాంగణంలోనే పుస్తకాలు విక్రయిస్తూ విద్యను వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా మోడల్ పదాన్ని వాడుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. కార్పొరేట్ పాఠశాలకు వత్తాసు పలుకుతున్న ఎంఈఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీఈవో మాత్రం పత్రిక ప్రకటనలకే పరిమితమయ్యారని విమర్శించారు. వెంటనే స్కూల్ గుర్తింపు రద్దుచేసి కేసులు నమోదు చేయకుంటే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కరణ్ సింగ్, రాజకుమార్, అబ్దుల్ సలాం తదితరులు పాల్గొన్నారు.

goutham

ఇది కూడా చదవండి: తుంగభద్రలో మన నీటి వాటాకు తూట్లు పొడిచే పనికి రేవంత్ మద్దతు: కవిత 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *