అక్షరటుడే, కామారెడ్డి: Goat Electrocuted | విద్యుత్ వైరు తెగిపడి షాక్తో మేక మృతి చెందగా మరొక మేకకు గాయాలయ్యాయి. ఈ ఘటన పాల్వంచ(Palwancha) మండలం ఆరేపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది.
Goat Electrocuted | ఆరెపల్లికి చెందిన..
ఆరెపల్లికి చెందిన బైకరి మల్లయ్య తన మేకలను రోజు మాదిరిగాంర్ మేతకు తీసుకెళ్లాడు. మేకలు మేత మేసుకుంటు వెళ్లగా ట్రాన్స్‌ఫార్మర్ వద్ద పైనుంచి విద్యుత్ వైరు తెగిపడి మేకలపై పడింది. దీంతో సుమారు రూ.15వేల విలువైన ఒక మేక మృతి చెందింది. మరొక మేకకు తీవ్ర గాయాలు కాగా వెటర్నరీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా (Kamareddy) బాధితుడు బైకరి మల్లయ్య మాట్లాడుతూ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుత్ వైర్లు తెగిపడడంతో తన మేక మృతి చెందిందని, మరొక మేకకు గాయాలయ్యాయని తెలిపారు.
ఈ ఘటనలో తాను ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నానని చెప్పారు. ట్రాన్స్‌ఫార్మర్ వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. విద్యుత్ శాఖ అధికారులు తనకు పరిహారం అందించాలని కోరారు.
ఇది కూడా చదవండి : పొంగిపొర్లుతున్న పోచారం ప్రాజెక్టు