Pre Primary Classes | ప్రభుత్వ బడుల్లో ప్రీ ప్రైమరీ తరగతుల ప్రారంభం

Balla Sandeep Kumar

అక్షరటుడే, బాల్కొండ: Pre Primary Classes | తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విద్యను బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా బాల్కొండ (Balkonda) మండలానికి నాలుగు ప్రీ-ప్రైమరీ పాఠశాలలు మంజూరైనట్లు మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ తెలిపారు.

Pre Primary Classes

మండలంలోని చిట్టాపూర్, ప్రేమ్‌నగర్, జలాల్పూర్, వన్నెల్-బి ప్రాథమిక పాఠశాలల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు ప్రారంభం కానుండగా, నాగపూర్ పాఠశాలలో కూడా ఈ తరగతులు కొనసాగనున్నాయి. ప్రతి పాఠశాలకు రూ.లక్ష మౌలిక వసతుల నిధిని కేటాయించడంతో పాటు ప్రత్యేక ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాలను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

Pre Primary Classes | పాఠ్య పుస్తకాల పంపిణీ

Pre Primary Classes

 

నూతన విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ సరఫరా చేసినట్లు ఎంఈఓ బట్టు రాజేశ్వర్ తెలిపారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండలో నిర్వహించిన కార్యక్రమంలో 5,683 పాఠ్యపుస్తకాలు, 21,039 నోట్‌బుక్స్‌ను ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పంపిణీ చేశారు. విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Armoor Theft Case | బాబాయి ఇంట్లో చోరీ చేయించిన వ్యక్తి.. ముగ్గురి అరెస్ట్

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *