IAS Couple | భార్యాభర్తలు.. పక్క పక్క జిల్లాల కలెక్టర్లు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : IAS Couple | ఆ ఇద్దరు దంపతులు ఐఏఎస్ (IAS) అధికారులు. ఇప్పుడు పక్క పక్క జిల్లాలకు కలెక్టర్లుగా కొనసాగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన విషయం తెలిసిందే.

నిర్మల్​ కలెక్టర్​గా ఉన్న అభిలాషను ట్రాన్స్​ఫర్​ చేసింది. ఆ స్థానంలో భవేష్ మిశ్రా (Bhavesh Mishra)ను నియమించింది. ఆదివారం కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో భవేష్ మిశ్రా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన తన భార్య, నిజామాబాద్​ కలెక్టర్​ ఇలా త్రిపాఠి (Ila Tripathi)తో కలిసి బాసర జ్ఞాన సరస్వతి ఆలయాన్ని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భార్యాభర్తలు ఇద్దరు కలెక్టర్లు కావడం.. పక్క పక్క జిల్లాల్లో పోస్టింగ్​ పొందడం గమనార్హం.

nirmal collector

IAS Couple | 2015 బ్యాచ్​ ఐఏఎస్

భవేశ్​ మిశ్రా గతంలో మైన్స్​, జియోలాజీ డైరెక్టర్​గా కొనసాగారు. ఆయన 2015 బ్యాచ్​కు చెందిన ఐఏఎస్ అధికారి. ఇలా త్రిపాఠి 2017 బ్యాచ్​ ఐఏఎస్​ అధికారి. ఆమె గతంలో నల్గొండ కలెక్టర్​గా పని చేశారు. కొన్ని నెలల క్రితం బదిలీపై నిజామాబాద్​కు వచ్చారు.

ఇది కూడా చదవండి : Telangana Rain Alert | తెలంగాణలో మళ్లీ వర్షాలు..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *