Young India School | యంగ్ ఇండియా పాఠశాల కామారెడ్డిలోనే ఏర్పాటు చేయాలి

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములలో ఏర్పాటు చేయాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు ప్రభుత్వాన్ని కోరారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి : Young India School | కామారెడ్డి నియోజకవర్గానికి కేటాయించిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములలో ఏర్పాటు చేయాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లా కేంద్రంలో బస్టాండ్, రైల్వే స్టేషన్​కు దగ్గరలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విస్తారమైన భూములు ఉన్నాయని, ఆ భూములలో విద్యాసంస్థను ఏర్పాటు చేసి అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Young India School | కామారెడ్డి వెనుకబడిపోయిందని..

సాంకేతిక విద్యాసంస్థలు లేకపోవడం వల్ల ఇప్పటికే కామారెడ్డి జిల్లా వెనుకబడిపోయిందని, ఏటీసీ సెంటర్ ను కూడా భిక్కనూరులో కాకుండా కామారెడ్డి జిల్లా కేంద్రంలోనే (Kamareddy District) ఏర్పాటు చేస్తే జిల్లావ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గమనించి జిల్లా కేంద్రంలోనే విద్యాసంస్థల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భిక్కనూరు మండలంలో ఫార్మా కంపెనీల వల్ల పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రాబోయే రోజుల్లో తాగేనీరు, పీల్చే గాలి, భూములు కాలుష్యమై ప్రజలు గ్రామాలను విడిచిపెట్టే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని రకాల సదుపాయాలు ఉన్న డిగ్రీ కళాశాల భూములలో యంగ్ ఇండియా పాఠశాలను ఏర్పాటు చేస్తే జిల్లా కేంద్రం అభివృద్ధి చెందడంతో పాటు విద్యార్థులకు న్యాయం జరుగుతుందన్నారు. గత సీఎం కేసీఆర్ కామారెడ్డి పర్యటనలో డిగ్రీ కళాశాల భూములలో విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి మోసం చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఆ భూములలో విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి..: Sarpanch Forum President | సర్పంచ్​ల ఫోరం అధ్యక్షుడి ఎన్నిక చెల్లదు..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *