అక్షరటుడే, ఇందూరు: Nizamabad Development | త్వరలోనే అర్బన్‌లో (Nizamabad Urban) రూ.60కోట్లతో అన్ని డివిజన్లలో పనులు ప్రారంభం కానున్నాయని ఎమ్మెల్యే ధన్పాల్(Mla Dhanpal) పేర్కొన్నారు. ఈ మేరకు తన క్యాంప్ కార్యాలయంలో శనివారం పబ్లిక్ హెల్త్, ఆర్అండ్బీ అధికారులతో సమావేశం నిర్వహించారు.
Nizamabad Development | క్షేత్రస్థాయిలో పర్యటించాలి
నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రతి పనిపై అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పర్యవేక్షణ చేయాలని ఎమ్మెల్యే సూచించారు. టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.60 కోట్లతో ప్రారంభమైన పనులను నాణ్యతతో చేపట్టాలని సూచించారు. ప్రతి డివిజన్‌కు రూ.కోటి కేటాయించారని త్వరలోనే అన్ని డివిజన్లో పనులు ప్రారంభమవుయన్నారు. సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు సిబ్బందితో సమీక్షలు నిర్వహిస్తూ పనుల పురోగతిపై సూచనలు ఇవ్వాలన్నారు. అలాగే నూతన పనులపై ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించాలని సూచించారు.
Nizamabad Development | రేడియో స్టేషన్ నుంచి..
ప్రధానగా నగరంలోని రేడియో స్టేషన్ నుంచి ముదక్పల్లి వరకు రూ.30 కోట్లతో రోడ్డు ప్రతిపాదించామన్నారు. అలాగే ఆర్యూబీల నిర్మాణానికి రూ.60 కోట్లు, నాందేవ్‌వాడ వంతెన పొడిగింపునకు రూ.100 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అమృత్–2 కింద మంజూరైన యూజీడీ పనుల్లో వేగం పెరిగిందని తెలిపారు. సమావేశంలో పబ్లిక్ హెల్త్ ఈఈ తిరుపతి, డీఈ యోగేందర్, ఏఈ శంకర్, యూజీడీ ప్రాజెక్ట్ మేనేజర్ జయశంకర్, ఆర్అండ్బీ అధికారి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి : R Narayana Murthy | కాపీ కొట్టి డాక్టర్లు, ఇంజనీర్లు అయితే బ్రిడ్జీలు కూలిపోతాయి: ఆర్.నారాయణమూర్తి