Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల కోసం.. యూపీఐ ద్వారానే రూ.10 వేలు చెల్లించాలి : మంత్రి పొంగులేటి

ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తు సమయంలో రూ.10 వేలు ఈఎండీ యూపీఐ ద్వారా చెల్లించాలని మంత్రి పొంగులేటి సూచించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Indiramma Housing Scheme | హైదరాబాద్ (Hyderabad) నగరంలో పేదల కోసం ఇందిరమ్మ టవర్ల నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే. ఇళ్ల కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది.

నగరంలో పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కల నెరవేర్చేందుకు ఈ పథకానికి సీఎం శ్రీకారం చుట్టారని మంత్రి పొంగులేటి (Ponguleti) తెలిపారు. ఈ పథకంపై సమాచారం అందించేందుకు ప్రత్యేక కాల్ సెంట‌ర్ హెల్ప్‌లైన్‌ను శనివారం హౌసింగ్ బోర్డు కార్యాలయంలో మంత్రి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఎలాంటి సందేహాలు ఉన్నా మ‌ధ్య‌వ‌ర్తుల‌ను న‌మ్మ‌కుండా నేరుగా 040-24603572 నంబర్‌కు ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయింత్రం 6గంట‌ల‌మ‌ధ్య‌ ఫోన్ చేయొచ్చన్నారు.

Indiramma Housing Scheme | తిరిగి చెల్లిస్తాం

ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో రూ.100 ఫీజుతో పాటు రూ.10 వేలు ఇఎండీ (EMD) చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇల్లు రాకపోతే ఆ రూ.10 వేలను ప్రభుత్వం తిరిగి ఇస్తుంది. ద‌ర‌ఖాస్తు స‌మ‌యంలో 10 వేల రూపాయిల చెల్లింపున‌కు యూపీఐ (UPI), నెట్ బ్యాంకింగ్‌ను మాత్ర‌మే ఉప‌యోగించాల‌ని మంత్రి సూచించారు. ఒక వేళ ఇల్లు మంజూరు కాక‌పోతే తిరిగి అదే ఖాతాకు ఆ మొత్తం వాప‌సు అవుతుంద‌న్నారు. ప‌రిశీల‌న‌, కేటాయింపు, వాప‌సు త‌దిత‌ర స‌మాచారం పూర్తయ్యేవ‌ర‌కు మీసేవ ర‌శీదు, చెల్లింపు ర‌శీదు, ద‌ర‌ఖాస్తు సంఖ్య‌, మొబైల్‌నెంబ‌ర్‌ల‌ను యాక్టివ్‌గా ఉంచుకోవాల‌ని సూచించారు. మీ సేవ ఆపరేటర్ల ఖాతా నుంచి డబ్బులు చెల్లిస్తే తిరిగి వారికే వెళ్లాయని పేర్కొన్నారు. ఇతరుల అకౌంట్​ నుంచి కాకుండా దరఖాస్తుదారు, కుటుంబ సభ్యుల యూపీఐ లేదా నెట్​ బ్యాంకింగ్​ ద్వారా మాత్రమే డబ్బులు చెల్లించాలని సూచించారు.

Indiramma Housing Scheme | తొలి విడుతలో 7,680 ఇళ్లు

క్యూర్ ప‌రిధిలో తొలివిడ‌త‌లో 16 నియోజకవర్గాలలో 7680 ఇళ్ల నిర్మాణానికి శ్రీ‌కారం చుట్టిన‌ట్లు తెలిపారు. ఏ నియోజకవర్గానికి చెందిన ప్రజలు అదే నియోజకవర్గంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ద‌ర‌ఖాస్తుదారులు తప్పుడు ప్రచారాలను నమ్మొద్దన్నారు. మీ సేవ కేంద్రాలు, ఆన్‌లైన్ పోర్టల్, వాట్సాప్ ద్వారా మాత్రమే చేసుకోవాలని సూచించారు. ఇళ్ల పేరిట ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. ద‌ర‌ఖాస్తు చేసే స‌మ‌యంలో ఆధార్ నెంబ‌ర్ తెలియ‌జేస్తే స‌రిపోతుంద‌ని, కుల‌, జీత భ‌త్యాల ధృవీక‌ర‌ణ పత్రాల‌ను అప్ లోడ్ చేయాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

దీనిని కూడా చదవండి : CJP Protest Ends | నిరసనను విరమించిన సీజేపీ.. కేసులు ఉండవని కేంద్రం హామీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *