అక్షరటుడే, ఇందూరు: BMS Foundation Day | కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా బీఎంఎస్ను ప్రారంభించారని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ(MLA Dhanpal Surya Narayana) పేర్కొన్నారు. భారతీయ మజ్దూర్ సంఘ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని(BMS Foundation Day) పురస్కరించుకొని గురువారం నగరంలోని(Nizamabad) నిజామాబాద్ డిపో–2లో జెండాను ఆవిష్కరించారు.
BMS Foundation Day | లోకమాన్య బాల గంగాధర్ తిలక్ జయంతి రోజున..
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. లోకమాన్య బాల గంగాధర్ తిలక్ జయంతి రోజున దత్తో పంత్ తెంగడి బీఎంఎస్ను స్థాపించారని గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కార్మికుల సంక్షేమం, సామాజిక భద్రత, ఉపాధి అవకాశాల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. రాజకీయ ప్రయోజనాల కంటే కార్మికుల హక్కులు, దేశ ప్రయోజనాలు ముఖ్యమనే సిద్ధాంతంతో పనిచేస్తుందన్నారు. దేశంలో సభ్యత్వం పరంగా అతిపెద్ద కార్మిక సంఘాల్లో ఒకటిగా గుర్తింపు పొందడం సంతోషకరమన్నారు.
ప్రధానంగా ‘వికసిత్ భారత్’ నిర్మాణంలో కార్మికుల పాత్ర కీలకమని, శ్రమకు గౌరవం ఇవ్వడం భారతీయ సంస్కృతిలో భాగమన్నారు. దేశానికి రైతు అన్నం పెడితే కార్మికుడు దేశాన్ని నిర్మిస్తాడని కొనియాడారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు శ్రావణ్, మఠం పవన్, జ్యోతి మురళి, బీఎంఎస్ జిల్లా అధ్యక్షుడు సాయరెడ్డి, శ్రీనివాస్ చారి, రాష్ట్ర ఉపాధ్యక్షులు స్వామి కుమార్, ఆర్టీసీ కార్మిక సంఘం ప్రతినిధులు కేబీ సింగ్, సరోజ, రాములు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: చెన్నైలోని రోహిణి థియేటర్‌లో ‘జన నాయగన్’ సినిమా వీక్షించిన నటి త్రిష