అక్షరటుడే, బోధన్: Akhanda Rudrabhishekam | పట్టణంలోని (Bodhan) బ్రాహ్మణ సమాజ్ ఆధ్వర్యంలో బ్రాహ్మణ వీధిలో ఉన్న దక్షిణముఖి ఆంజనేయస్వామి ఆలయంలో (Anjaneya Swamy Temple) అఖండ రుద్రాభిషేకం విజయవంతంగా పూర్తయింది. 72 గంటల పాటు భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Akhanda Rudrabhishekam | వర్షాలు కురవాలని..
రాష్ట్రంలో (Telangana) వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడిపంటలు బాగుండాలని సంకల్పంతో 72 గంటల పాటు అఖండ రుద్రాభిషేకం నిర్వహించినట్లు ఆలయ ధర్మకర్తలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూర్తి ఏర్పాట్లు చేశారు. మూడురోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో వేద పండితులు, పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారని నిర్వాహకులు తెలిపారు.
ఇది కూడా చదవండి: ఢిల్లీలో నిరసనల వేళ.. కేంద్రం కీలక నిర్ణయం