Blood Donation Camp | ట్రెసా, హెల్పింగ్​ హార్ట్స్​ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో రక్తదానం

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Blood Donation Camp | తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్​లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తలసేమియా రోగుల కోసం హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

Blood Donation Camp | రక్తదానం ప్రాణదానం

ట్రెసా, హెల్పింగ్​​ హార్ట్స్​ అధ్యక్షుడు రమణ్​రెడ్డి మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానమన్నారు. ఎండాకాలంలో తీవ్రమైన రక్త కొరత ఏర్పడుతుందని, రెడ్​క్రాస్​ (Red Cross)లో తలసేమియా రోగులకు కొరత రావొద్దనే ఉద్దేశంతో ట్రెసా, హెల్పింగ్​ హార్ట్స్​ ఆధ్వర్యంలో రక్తదానం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు పెద్దఎత్తున తరలివచ్చి రక్తదానం చేయడం హర్షణీయమన్నారు. 80మంది వరకు జీపీవోలు రక్తదానం చేశారన్నారు. కార్యక్రమంలో రెడ్​క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు బుస్సా ఆంజనేయులు, రాష్ట్ర కార్యదర్శి తోట రాజశేఖర్, ట్రెసా, హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ సభ్యులు, జీపీవోలు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Profitable Crops Awareness | రైతులకు లాభసాటి పంటలపై అవగాహన కల్పించాలి : ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *