Garbage Collection | చెత్తసేకరణలో నిర్లక్ష్యంపై కౌన్సిలర్ పోరుబాట.. చెత్తకుప్పపై కూర్చుని నిరసన

కామారెడ్డి పట్టణంలో చెత్త సేకరణ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. దీంతో విసుగుచెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్ గెరిగంటి లక్ష్మీనారాయణ చెత్త కుప్పల వద్ద నిరసన వ్యక్తం చేశాడు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Garbage Collection | పట్టణం (Kamareddy)లో చెత్త సేకరణ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడపడితే అక్కడ చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. దాంతో పట్టణం అంతా దుర్గంధం వెదజల్లుతోంది.

Garbage Collection | ప్రజలు ఫిర్యాదులు చేసినప్పటికీ..

స్థానిక కౌన్సిలర్లు, ప్రజలు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో విసుగు చెందిన 46వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ గెరిగంటి లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన వార్డులో పేరుకుపోయిన చెత్త కుప్పల్లో కూర్చుని నిరసన వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఆయన కామారెడ్డి పట్టణాన్ని మున్సిపల్ కమిషనర్ డంపింగ్ యార్డుగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించాడు. ఇలాగే కొనసాగితే ప్రజలు అనేక ఇబ్బందులు పడతారని తెలిపాడు. ఇకనైనా అధికారులు చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని డిమాండ్​ చేశాడు. కౌన్సిలర్ నిరసన తర్వాత స్పందించిన అధికారులు సుభాష్ రోడ్డులో చెత్త తొలగించినా జీజీహెచ్ వద్ద మాత్రం అలాగే ఉంచారు.

ఇది కూడా చదవండి..: Annapurna Seva Rath | జీసీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘అన్నపూర్ణ సేవారథం’

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *