Telangana University Recruitment | తెయూలో నియామకాలపై ‘ఎస్టీ కమిషన్’ సీరియస్.. అధికారులకు నోటీసులు

తెలంగాణ యూనివర్సిటీలో గతంలో జరిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల వ్యవహారం తాజాగా మళ్లీ చర్చల్లోకి వచ్చింది.

shashi kiran Mottala

అక్షరటుడే, తెయూ క్యాంపస్: Telangana University Recruitment | తెలంగాణ యూనివర్సిటీలో(TU) గతంలో జరిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల వ్యవహారం తాజాగా మళ్లీ చర్చల్లోకి వచ్చింది. ఆ నియామకాలపై జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టి సారించింది.

Telangana University Recruitment | 2‌‌013లో నియామకాలు

తెయూలో 2013లో చేపట్టిన నియామక ప్రక్రియలో రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ పాలసీ(Reservation Policy), రోస్టర్ పాయింట్ విధానాన్ని సరిగా పాటించలేదనే తీవ్ర ఆరోపణలపై జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టి సారించింది. 2013 నియామకాల్లో ఎస్టీ అభ్యర్థులకు చెందాల్సిన రోస్టర్ పాయింట్లలో అక్రమాలు జరిగాయని, అర్హత ఉన్నప్పటికీ తనకు అన్యాయం జరిగిందని బాధితుడు వెంకట్ నాయక్ జాతీయ ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన కమిషన్, సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది.

Telangana University Recruitment | ఈనెల 14న హైదరాబాద్‌లో విచారణ

దర్యాప్తు ప్రక్రియలో భాగంగా జాతీయ ఎస్టీ కమిషన్ డైరెక్టర్ కళ్యాణ్ రెడ్డి శనివారం నోటీసులు జారీ చేయడం గమనార్హం. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, తెలంగాణ యూనివర్సిటీ ఉన్నతాధికారులు, ఫిర్యాదుదారుడైన బాధితుడు వెంకట్ నాయక్.. ఈనెల 14వ తేదీన హైదరాబాద్‌లోని విచారణ కేంద్రంలో కమిషన్ ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించారు. కేవలం సమాధాన పత్రాలు పంపడం కాకుండా, 2013 నాటి నియామక నోటిఫికేషన్, రోస్టర్ రిజిస్టర్లు, ఎంపిక జాబితాలు, మెరిట్ లిస్ట్‌లతో సహా.. అన్ని సంబంధిత అసలు రికార్డులను తీసుకొని విచారణకు హాజరుకావాలని కమిషన్ నోటీసులో స్పష్టం చేసింది.

Telangana University Recruitment | ఉన్నత విద్యలో రోస్టర్ ఉల్లంఘనపై వివాదం

యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, ప్రొఫెసర్స్ నియామకాల్లో రోస్టర్ పాయింట్ల అమలు ఏళ్లుగా వివాదాస్పదంగానే ఉంటోంది. రాజ్యాంగం కల్పించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను సరిగ్గా అమలు చేయకపోవడంతో అర్హులైన అభ్యర్థులు ఉన్నత అవకాశాలను కోల్పోతున్నారనే విమర్శలు ఉన్నాయి. 2013లో జరిగిన ఈ నియామకాల్లో రోస్టర్ పాయింట్ల గందరగోళం నిజమేనని జాతీయ ఎస్టీ కమిషన్ విచారణలో తేలితే, తెలంగాణ యూనివర్సిటీ అధికారులకు ఇది పెద్ద దెబ్బగా పరిణమించే అవకాశం ఉందని విద్యావేత్తలు అంటున్నారు. జాతీయ ఎస్టీ కమిషన్ స్వయంగా జోక్యం చేసుకోవడం, పైగా అధికారులను నేరుగా హాజరు కావాలని ఆదేశించడంతో ఈ విచారణ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ విచారణ తర్వాత వర్సిటీ నియామకాలపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందోనని ఉన్నత విద్యావర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

ఇది కూడా చదవండి: #Agadha TRAILER OUT NOW

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *