అక్షరటుడే, వెబ్డెస్క్ : Traffic Restrictions | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని సైదాబాద్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. సైదాబాద్ జంక్షన్ (Saidabad Junction), యాదగిరి థియేటర్ (కుడి వైపున) మధ్య నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ (Elevated Corridor) పనులతో ఈ నెల 18 నుంచి 21 వరకు సైదాబాద్ వై జంక్షన్, యాదగిరి థియేటర్ మధ్య రోడ్డు ఒకవైపు మూసి వేస్తామని ప్రకటించారు.
Traffic Restrictions | ట్రాఫిక్ మళ్లింపులు
భారీ ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉన్నందున నల్గొండ క్రాస్ రోడ్డు– ఒవైసీ హాస్పిటల్ మార్గంలో ప్రయాణించొద్దని పోలీసులు సూచించారు. నల్గొండ క్రాస్ రోడ్డు నుంచి చాంద్రాయణ్గుట్ట వచ్చే వాహనాలు వాహనాలు సైదాబాద్ వై జంక్షన్, డీసీపీ ఆఫీస్, సరస్వతి నగర్, సింగరేణి కాలనీ, చంపాపేట్, లక్ష్మారెడ్డి గార్డెన్ మీదుగా వెళ్లాలి. డీఎంఆర్ఎల్ నుంచి నల్గొండ క్రాస్ రోడ్డు వైపు వెళ్లే వాహనాలు లక్ష్మారెడ్డి గార్డెన్, చంపాపేట్, ఐఎస్ సదన్, శంఖేశ్వర్ బజార్, 105 బస్టాండ్, చంచల్గూడ మీదుగా రాకపోకలు సాగించాయి.
Traffic Restrictions | ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు
చంచల్గూడ, సైదాబాద్ వై జంక్షన్ మధ్య ఎడమ వైపు (LHS) రోడ్డుపై తాత్కాలికంగా ‘టూ-వే’ (రెండు వైపులా రాకపోకలు సాగించే) ఏర్పాట్లు ఉంటాయి. కుడి వైపు (RHS) రోడ్డు మూసివేయబడుతుంది. ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలు ఎంజీబీఎస్ నుంచి చంపాపేట్ వెళ్లడానికి మలక్పేట్ గంజ్, మూసారాంబాగ్, దిల్సుఖ్నగర్, కొత్తపేట, ఎల్బీ నగర్ మీదుగా వెళ్లాలి. కాలనీ వాహనాలు, ద్విచక్ర వాహనాలు, ఆటో-రిక్షాలు యాదగిరి థియేటర్ రోడ్, అందుబాటులో ఉన్న అంతర్గత దారులను (by-lanes) ఉపయోగించవచ్చని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
దీనిని కూడా చదవండి : Revanth Reddy | 2034 వరకు అధికారం మాదే : సీఎం రేవంత్రెడ్డి