అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Revanth Reddy | రాష్ట్రంలో 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఘట్కేసర్‌లో ప్రముఖ కవి అందెశ్రీ స్మృతివనం నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.
సీఎం మాట్లాడుతూ.. దొరలు అహంకారంతో అందెశ్రీ పాటను నిర్బంధించారని విమర్శించారు. నాడు నిర్బంధించిన పాట.. నేడు తెలంగాణ గీతం అయ్యిందన్నారు. అందెశ్రీ, గద్దర్‌తో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోతారని ఆనాడే చెప్పానని పేర్కొన్నారు. ఆత్మగౌరవం ఉన్న అందెశ్రీ ఏనాడూ దొరల గడప తొక్కలేదన్నారు. తమకు అందెశ్రీ, గద్దర్ స్ఫూర్తి అని పేర్కొన్నారు. తనకు అందెశ్రీ ఆత్మ బంధువని అన్నారు. ఆయన రచించిన ‘జయ జయహే తెలంగాణ’, ‘మాయమైపోతున్నాడు మనిషన్నవాడు’ పాటలు కావని, అవి తూటాలై ప్రజావ్యతిరేక పాలకుల గడీలను కుప్పకూల్చే ఫిరంగులు అయ్యాయన్నారు.
Revanth Reddy | ప్రశ్నపత్రాలు అమ్ముకున్నారు
బీఆర్‌ఎస్ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి ప్రశ్నాపత్రాలను జిరాక్స్ సెంటర్లలో అమ్ముకున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తాము నోటిఫికేషన్ ఇచ్చాం.. రేవంత్‌రెడ్డి భర్తీ చేశాడని నిసిగ్గుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉద్యోగాలు భర్తీ చేయాలనే ఆలోచన వారికి ఎందుకు రాలేదన్నారు. కేటీఆర్ నిర్వహించిన యువ సంగ్రామ సదస్సుపై సీఎం విమర్శలు చేశారు. నోటిఫికేషన్లు ఇచ్చిన వారు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
Revanth Reddy | తెలంగాణకు ద్రోహం చేశారు
దుబాయి పాస్‌పోర్ట్ బ్రోకర్‌ను తెలంగాణ సీఎం చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయన కుటుంబానికి తెలంగాణ ఎంతోచేస్తే.. వారు ప్రజలకు ద్రోహం చేశారన్నారు. అసెంబ్లీకి రమ్మంటే ఇంట్లో పడుకుంటారని కేసీఆర్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మాయగాళ్ల మాటలో పడొద్దని ప్రజలకు సూచించారు. ఉద్యమ సమయంలో రూ.100 పెట్టి పెట్రోల్ తెచ్చుకున్న వ్యక్తి.. అగ్గిపెట్టే తెచ్చుకోలేదని హరీశ్‌రావును ఉద్దేశించి అన్నారు. అప్పుడు ఎవరైన అగ్గిపెట్టే గీరి ఉంటే తెలంగాణ సమాజానికి బాధనే ఉండేది కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అది చూసి భావోద్వేగానికి గురైన ఎంతో మంది ప్రాణాలను త్యాగం చేశారని గుర్తు చేశారు. కానీ కేసీఆర్ కుటుంబంలో ఒక్కరికైనా గీత పడిందా అని అన్నారు.
Revanth Reddy | హాజరైన మల్లారెడ్డి
బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం సరూర్‌నగర్ స్టేడియంలో యువ సంగ్రామ సదస్సు పేరిట సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభకు జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు హాజరు అయ్యారు. అయితే దీనికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి హాజరు కాలేదు. కానీ సాయంత్రం నిర్వహించిన సీఎం సభలో ఆయన పాల్గొనడం గమనార్హం.
TG: తనకు అందెశ్రీ ఆత్మ బంధువని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘నిరాశ, నిస్పృహలకు లోనైనప్పుడు అందెశ్రీ స్ఫూర్తిగా నిలబడేవారు. ఆయన రచించిన ‘జయ జయహే తెలంగాణ’, ‘మాయమైపోతున్నాడు మనిషన్నవాడు’ పాటలు కావు. అవి తూటాలై ప్రజావ్యతిరేక పాలకుల గడీలను కుప్పకూల్చే మరపిరంగులై తెలంగాణలో పేలాయి’’ అని… pic.twitter.com/QQTXQdEl0i
— ChotaNews App (@ChotaNewsApp) July 18, 2026
దీనిని కూడా చదవండి : National Film Awards | జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన.. ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రోళ్లు