HYDRAA Fire Safety | అగ్ని ప్ర‌మాదాల నివార‌ణ‌పై హైడ్రా దృష్టి

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA Fire Safety | అగ్ని ప్ర‌మాదాల నివార‌ణపై హైడ్రా (Hydraa) దృష్టి పెట్టింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలు రూపొందించ‌డంపై రాష్ట్ర ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేస్తోంది. ప్ర‌భుత్వం రూపొందించిన విధివిధానాలు, నియ‌మ‌నిబంధ‌న‌ల ప్ర‌కారం హైడ్రా త‌దుప‌రి చ‌ర్య‌లుంటాయ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ గారు తెలిపారు.

అమీర్‌పేట‌ (Ameerpet) మైత్రీవనంలోని ప‌రిస‌రాల్లోని వెస్ట్ శ్రీ‌నివాస‌న‌గ‌ర్‌లో అగ్ని ప్ర‌మాదానికి గురైన షాపింగ్ కాంప్లెక్స్‌ను శుక్ర‌వారం హైడ్రా క‌మిష‌న‌ర్ ప‌రిశీలించారు. అగ్ని ప్ర‌మాదాల‌కు గ‌ల కార‌ణాలు తెలుసుకున్నారు. పురాత‌న విద్యుత్ వైరింగ్‌, సామ‌ర్థ్యానికి మించి క‌రెంటు వినియోగం వ‌ల్ల త‌ర‌చూ షార్ట్ స‌ర్క్యూట్స్ ఏర్ప‌డి అగ్ని ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయ‌న్నారు. గురువారం అమీర్‌పేటలో జ‌రిగిన అగ్ని ప్ర‌మాదానికి ప‌క్క‌నే ఉన్న మెస్‌కు సంబంధించి చిమ్నీల ద్వారా నిప్పుర‌వ్వ‌లు ప‌డ‌డం లేదా షార్ట్​ సర్క్యూట్​ కారణం కావొచ్చన్నారు. ఈ విష‌య‌మై పూర్తి స్థాయి ద‌ర్యాప్తు జ‌రుగుతోంద‌న్నారు.

HYDRAA Fire Safety | కఠిన చర్యలు

ranganath

అగ్ని ప్ర‌మాదాల‌ను నియంత్రించాల‌నే ప్ర‌భుత్వం కృత నిశ్చ‌యంతో ఉందని రంగనాథ్​ (Hydraa Commissioner) తెలిపారు. ఎన్‌వోసీల జారీ, త‌నిఖీలు, నిబంధ‌న‌లు పాటించ‌ని వారిపై చ‌ర్య‌లు ఇలా చాలా మార్పులు రానున్నాయ‌ని పేర్కొన్నారు. న‌గ‌రంలో చాలా వ‌ర‌కు భ‌వ‌నాలు, దుకాణ స‌ముదాయాలకు ఫైర్ ఎన్​వోసీలు లేవ‌ని.. చెక్ చేసి నిబంధ‌న‌లు పాటించేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. వ‌ర‌ద కాలువ‌ల‌పై నిర్మాణాల విష‌యంలో కూడా.. ప్ర‌వాహానికి ఆటంకం క‌ల‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. తాజాగా అగ్ని ప్రమాదం జరిగిన భవనం నాలాపై ఉన్నట్లు తేలితే కూల్చేస్తామన్నారు.

దీనిని కూడా చదవండి : Hyderabad Spa Raids | స్పాల ముసుగులో వ్యభిచారం.. 113 కేంద్రాలపై ఏకకాలంలో దాడులు చేసిన వందల మంది పోలీసులు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *