Harish Rao Pending Bills | దివ్యాంగులకు బిల్లులు చెల్లించని ప్రభుత్వం : హరీశ్​రావు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao Pending Bills | దివ్యాంగులకు ఉపాధి కల్పిస్తున్న సంస్థకు రెండేళ్లుగా బిల్లులు చెల్లించక పోవడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు. వెంటనే బిల్లులు చెల్లించాలని ఆయన డిమాండ్​ చేశారు.

సంగారెడ్డి జిల్లాకు చెందిన జుబేదా బేగం దివ్యాంగ్ సోలార్ సొసైటీ,

దివ్యాంగ్ గార్మెంట్స్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులకు ఉపాధి కల్పిస్తున్నారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఎస్సీ సంక్షేమ హాస్టళ్లకు దుస్తులు కుట్టి సరఫరా చేశారు. అయితే దానికి సంబంధించిన బిల్లులు రూ.16 లక్షలు రెండేళ్లుగా పెండింగ్​లో ఉన్నాయి.

Harish Rao Pending Bills | జీతాలకు ఇబ్బందులు

పెండింగ్​ బిల్లులు చెల్లించేలా చూడాలని జుబేదా బేగం హరీశ్​రావును కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందున్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దివ్యాంగుల సంక్షేమం గురించి గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం, వారి కష్టార్జితాన్ని చెల్లించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన ప్రశ్నించారు. వెంటనే స్పందించి బిల్లులను విడుదల చేసి, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు.

దీనిని కూడా చదవండి : Cyclone Arnab | తుపాన్​ ఎఫెక్ట్​.. 28 నుంచి భారీ వర్షాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *