Hyderabad Rain | హైదరాబాద్‌లో భారీ వర్షం.. పలు చోట్ల ట్రాఫిక్​ జామ్​

హైదరాబాద్​ నగరంలో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Rain | హైదరాబాద్​ నగరంలో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి కుండపోత వాన పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

నగరంలోని సికింద్రాబాద్​ (Secunderabad), తిరుమలగిరి, బేగంపేట్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్‌లో వాన దంచికొట్టింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో నగరంలో వాతావరణం చల్లబడగా.. రోడ్లు జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆఫీసులు, కాలేజీల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం పడటంతో ట్రాఫిక్​లో గంటల తరబడి నిరీక్షించారు.

Hyderabad Rain | అప్రమత్తంగా ఉండాలి

వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని నగర కమిషనర్​ సజ్జనార్ (CP Sajjanar)​ ప్రజలకు సూచించారు. ఈ రోజు రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప అనవసర ప్రయాణాలు చేయవద్దని కోరారు. బయట ఉన్నవారు వర్ష తీవ్రత పెరిగే లోపే పనులను త్వరగా ముగించుకుని క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని ఆయన సూచించారు. నీరు నిలిచిన రహదారులు, ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాల మీదుగా వెళ్లొద్దన్నారు.

దీనిని కూడా చదవండి : Prashant Kishor | బీజేపీకి షాక్​..​ ఉప ఎన్నికల్లో ప్రశాంత్​ కిశోర్​ ఘన విజయం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *