అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indian Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లో బుల్స్ జోరుమీదున్నాయి. దీంతో వరుసగా ఐదో సెషన్లోనూ ప్రధాన సూచీలు లాభాలతో ముగిశాయి. బుధవారం ఉదయం నష్టాలతో ప్రారంభమై లాభనష్టాల మధ్య ఊగిసలాడినా.. మధ్యాహ్నం తర్వాత సూచీలు కోలుకుని పైకి ఎగబాకాయి. ముడిచమురు ధరలు దిగి రావడంతో గ్లోబల్ మార్కెట్లు పాజిటివ్‌గా మారాయి. దీని ప్రభావం మన మార్కెట్లపైనా కనిపించింది. ఇటీవలి కాలంలో విదేశీ సంస్థాగత మదుపరులు మార్కెట్‌కు అండగా నిలుస్తుండడంతో మన సూచీలు రాణిస్తున్నాయి.
Indian Stock Market | నష్టాలతో ప్రారంభమై..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) బుధవారం ఒడిదుడుకుల మధ్య సాగింది. బుధవారం ఉదయం సెన్సెక్స్ 64 పాయింట్ల గ్యాప్ డౌన్లో ప్రారంభమైనా అక్కడినుంచి కోలుకుని 543 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్ ప్రధాన సూచీలు ఒక్కసారిగా నేలచూపులు చూశాయి. సెన్సెక్స్ 752 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 68 పాయింట్ల నష్టంతో ట్రెడింగ్ ప్రారంభించినా.. అక్కడినుంచి 136 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 250 పాయింట్లు నష్టపోయింది. చివరికి సెన్సెక్స్ 383 పాయింట్ల లాభంతో 77,301 వద్ద, నిఫ్టీ 150 పాయింట్ల లాభంతో 23,960 వద్ద స్థిరపడ్డాయి.
Indian Stock Market | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 3,074 కంపెనీలు లాభపడగా 1,313 స్టాక్స్ నష్టపోయాయి. 210 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 106 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 104 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 21 కంపెనీలు లాభాలతో, 9 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. బీఈఎల్ 4.56 శాతం, టైటాన్ 4.28 శాతం, ఇండిగో 2.39 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.38 శాతం, ఐటీసీ 2.32 శాతం లాభపడ్డాయి.
Top Losers : టీసీఎస్ 2.70 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 2.23 శాతం, ఇన్ఫోసిస్ 1.65 శాతం, ఎటర్నల్ 1.60 శాతం, కొటక్ బ్యాంక్ 1.08 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: Muhurat Trading 2026 | ‘ముహూరత్’ ట్రేడింగ్.. ముహూర్తమిదే