అక్షరటుడే, వెబ్‌డెస్క్: Muhurat Trading 2026 | సాధారణ రోజుల్లో దేశీయ ఈక్విటీ మార్కెట్ ఉదయం 9.15 నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు పనిచేస్తుంది. శని, ఆదివారాలతోపాటు ప్రధాన పండుగల సమయంలో మార్కెట్ మÖసి ఉంటుంది. దీపావళి సందర్భంగా స్టాక్ మార్కెట్ (Stock Market)కు సెలవు. అయినా లక్ష్మీ పూజ సందర్భంగా ఈ రోజు ప్రత్యేకంగా ట్రేడింగ్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దీనిని ముహూరత్ లేదా మూరత్ ట్రేడింగ్ అపి పిలుస్తారు.
Muhurat Trading 2026 | ముహూరత్ ఎప్పుడంటే?
దీపావళి కొత్త ఆర్థిక సంవత్సరమైన సంవత్ 2083 కి శ్రీకారం చుట్టే శుభ సమయం. ఈ నేపథ్యంలో ఏటా దీపావళి లక్ష్మీ పూజ రోజున బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రత్యేకంగా ముహూరత్ ట్రేడింగ్ నిర్వహిస్తారు. ఈసారి దీపావళి పండుగ నవంబర్ 8న వస్తోంది. ఆ రోజు ఆదివారం. అయినా ఒక గంట పాటు దీపావళి ముహూర్త ట్రేడింగ్ సెషన్‌ను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఈ ప్రత్యేక సెషన్ ఉండనుంది.
Muhurat Trading 2026 | ట్రేడింగ్ సమయాలు..
సంవత్ 2083 మూరత్ ట్రేడింగ్ నవంబర్ 8న ఉంటుంది. మధ్యాహ్నం 1.50 నుంచి 2.05 గంటల వరకు ‘బ్లాక్ డీల’ విండో అందుబాటులో ఉంటుంది. మధ్యాహ్నం 2.05 గంటలకు ప్రీ ఓపెన్ సెషన్ ప్రారంభమవుతుంది. ఇందులో లిమిట్, మార్కెట్ ఆర్డర్లను 2.10 గంటల వరకు నమోదు చేయవచ్చు. 2.10 నుంచి 2.15 గంటల మధ్య లిమిట్ ఆర్డర్లు మాత్రమే స్వీకరిస్తారు. ఆర్డర్ మ్యాచింగ్, నిర్ధారణ ప్రక్రియను 2.15 నుంచి 2.17 గంటల వరకు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.20 గంటల వరకు బఫర్ సమయం ఉంటుంది. సాధారణ ఈక్విటీ మార్కెట్ మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రారంభమై 3.30 గంటలకు ముగుస్తుంది. సీఏఎస్ పరిధిలోని స్టాక్స్ ముగింపు 3.15 గంటల వరకు ఉంటుంది. ఎఫ్ అండ్ వో ట్రేడింగ్ సమయం మధ్యాహ్నం 2.20 నుంచి 3.40 గంటల వరకు కొనసాగనుంది.
ఇది కూడా చదవండి..: Stock Market | ఒడిదుడుకుల్లో మార్కెట్లు.. స్వల్ప నష్టాల్లో సూచీలు