అక్షరటుడే వెబ్‌డెస్క్: Wrong UPI Transaction | స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు.. గూగుల్ పే , ఫోన్‌పే వంటి యూపీఐ యాప్‌ల ద్వారా చిటికెలో డబ్బులు పంపేస్తున్నాం. బ్యాంకుకు వెళ్లే పనిలేకుండా ఒక్క క్లిక్‌తో లావాదేవీలు పూర్తవుతున్నప్పటికీ, కొన్నిసార్లు ఈ డిజిటల్ సేవలు రిస్క్‌గా మారుతుంటాయి. హడావుడిలో నంబర్ తప్పుగా కొట్టడం, వేరే యూపీఐ ఐడీ ఎంటర్ చేయడం లేదా క్యూఆర్ కోడ్ తప్పుగా స్కాన్ చేయడం వల్ల డబ్బులు వేరేవారి అకౌంట్‌కి వెళ్తుంటాయి. ఒకసారి పేమెంట్ సక్సెస్ అయ్యాక దాన్ని నేరుగా క్యాన్సిల్ చేయడం కుదరదు. మరి అలాంటప్పుడు కంగారుపడకుండా డబ్బులను ఎలా వెనక్కి తెచ్చుకోవాలో ఇప్పుడు చూద్దాం.
Wrong UPI Transaction | యూపీఐ యాప్‌లో ఫిర్యాదు ..
మీరు ఏ యాప్ ద్వారా డబ్బులు పంపారో, వెంటనే ఆ యాప్‌ను ఓపెన్ చేసి కంప్లైంట్ చేయాలి. మీరు వాడిన యాప్‌లోని ట్రాన్సాక్షన్ హిస్టరీలోకి వెళ్లండి. తప్పుగా జరిగిన పేమెంట్‌ను సెలెక్ట్ చేసుకోండి. అందులో కనిపించే ‘రైజ్ ఎ కంప్లైంట్’ (Raise a Complaint) లేదా ‘రిపోర్ట్న్ ఇష్యూ’ ఆప్షన్‌ను ఎంచుకోండి. ఏం జరిగిందో వివరంగా చెప్పి ఫిర్యాదు రిజిస్టర్ చేయండి. కంప్లైంట్ చేశాక వచ్చే రిఫరెన్స్ నంబర్‌ను భద్రంగా దాచుకోండి.
Wrong UPI Transaction | బ్యాంకును సంప్రదించండి..
యాప్‌లో కంప్లైంట్ చేసి ఊరుకోకుండా, వెంటనే మీ బ్యాంకు కస్టమర్ కేర్‌కు కాల్ చేయండి. తప్పుగా డబ్బులు పంపిన తేదీ, సమయం, అమౌంట్, యూపీఐ రిఫరెన్స్ నంబర్, అవతలి వారి యూపీఐ ఐడీ వివరాలను బ్యాంకు అధికారులకు తెలపండి. మీ బ్యాంకు అవతలి వ్యక్తి బ్యాంకుతో మాట్లాడి డబ్బులు వెనక్కి తెప్పించే ప్రక్రియను ప్రారంభిస్తుంది.
Wrong UPI Transaction | ఎంత సమయం పడుతుంది..
పేమెంట్ ఫెయిల్ అయ్యి మీ అకౌంట్లో డబ్బులు కట్ అయితే ఆటోమేటిక్‌గా వెనక్కి వచ్చేస్తాయి. కానీ పేమెంట్ సక్సెస్ అయ్యి వేరేవారి అకౌంట్‌కి వెళితే ప్రాసెస్ వేరుగా ఉంటుంది. అవతలి వ్యక్తి అకౌంట్లో పడిన డబ్బును మీ బ్యాంకు దానంతట అదే తీసుకోలేదు. అవతలి బ్యాంకు ద్వారా వారిని సంప్రదించి అంగీకరిస్తేనే అమౌంట్ రిటర్న్ వస్తుంది. అందుకే దీనికి కొంత సమయం పడుతుంది.
డబ్బులు ఇవ్వనంటే ఏం చేయాలి?
పొరపాటున డబ్బులు పొందిన వ్యక్తి తిరిగి ఇవ్వడానికి ఒప్పుకుంటే సమస్య సులభంగానే పరిష్కారమవుతుంది. ఒకవేళ ఆ వ్యక్తి డబ్బులు ఇవ్వనని మొండికేస్తే, మీ దగ్గర ఉన్న కంప్లైంట్ రిఫరెన్స్ నంబర్‌తో మీ బ్యాంకును పదే పదే ఫాలో అప్ చేయాలి. బ్యాంకు సరిగ్గా స్పందించకపోతే, ఆ బ్యాంకు గ్రీవెన్స్ సెల్లో అప్పీల్ చేయవచ్చు. అక్కడ కూడా పరిష్కారమైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించవచ్చు.
Wrong UPI Transaction | సైబర్ మోసం..
మీరు పొరపాటున వేరేవారికి డబ్బులు పంపిస్తే అది రాంగ్ ట్రాన్సాక్షన్ అవుతుంది. అలా కాకుండా మీ ప్రమేయం లేకుండా అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయితే అది ఫ్రాడ్ కిందకు వస్తుంది. అలాంటి మోసాలు జరిగితే వెంటనే మీ బ్యాంకుకు, అవసరమైతే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. డబ్బులు పంపే ముందు స్క్రీన్ మీద కనిపిస్తున్న అవతలి వారి పేరు సరైనదేనా అని చెక్ చేయండి. ఒకే పేరుతో చాలా అకౌంట్లు ఉండొచ్చు కాబట్టి యూపీఐ ఐడీని పూర్తిగా పరిశీలించండి. షాపుల్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేటప్పుడు సరిగ్గా వెరిఫై చేసుకోండి. మీరు టైప్ చేసిన అమౌంట్ కరెక్టేనా అని ఒకటికి రెండుసార్లు చూసుకుని సెండ్ చేయండి.
పొరపాటు జరిగి డబ్బులు వేరేవారికి వెళితే టెన్షన్ పడకుండా వెంటనే యాప్‌లో, ఆపై బ్యాంకులో ఫిర్యాదు చేయడం ద్వారా డబ్బులు వెనక్కి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి లావాదేవీలు చేసేటప్పుడు కొన్ని సెకన్లు కేటాయించి వివరాలు సరిచూసుకోవడం ఎప్పుడూ మంచిది.
ఇది కూడా చదవండి: Kamareddy Traffic Problems | ట్రాఫిక్‌తో టెన్షన్..టెన్షన్.. కామారెడ్డి విస్తరణకు నోచుకోని రోడ్లతో అవస్థలెన్నో